ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని పరిస్థితులను చూస్తున్నామని ఆవేదన చెందారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై పవన్ కల్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) భేటీ అయ్యారు. కోనసీమ అల్లర్లు, అధికార పార్టీ నేతల దాడులు వంటి విషయాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ముఖ్యమంత్రి స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలోని రైతులను ఆదుకోని సీఎం మిగతా ప్రాంతాల రైతులను ఎలా ఆదుకుంటారని నిలదీశారు. త్వరలోనే పులివెందుల(Pulivendula) లో రైతు భరోసా యాత్ర చేపడతామని వివరించారు. పులివెందులలో చనిపోయిన 135 మంది రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.
కాగా.. బీజేపీ తో పొత్తు విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీజేపీతో పొత్తులో ఉన్నామని, ఈ విషయంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. అంతే కాకుండా కోనసీమ(Konaseema) లో జరిగిన అల్లర్లపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘర్షణలను కుల ఘర్షణలుగా చిత్రీకరించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కోనసీమలో అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ప్రశాంతమైన పచ్చని సీమలో చిచ్చురేపారని మండి పడ్డారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి, ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కుల ప్రభావిత పాలిటిక్స్ ను ఆపాలనే ఉద్దేశంతోనే బీజేపీ(BJP), టీడీపీతో కలిశామని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి