Andhra Pradesh:18 నెలలు తిరిగేలోగా రోజాను అదే స్టేషన్ లో కూర్చోబెడతా.. జనసేన నేత కిరణ్ రాయల్

|

Nov 13, 2022 | 12:27 PM

తప్పుడు కేసులకు భయపడేదేలే. వైసీపీ నేతలకు ఇక యుద్ధం అంటే ఏంటో చూపిస్తాం. నన్ను అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు. నా మీద కేసులు ఇది ఆరంభం.. నేనైతే సిద్ధం అంటూ సవాల్ చేశారు జనసేన నేత కిరణ్ రాయల్.

Andhra Pradesh:18 నెలలు తిరిగేలోగా రోజాను అదే స్టేషన్ లో కూర్చోబెడతా.. జనసేన నేత కిరణ్ రాయల్
Janasena Leader Kiran Royal
Follow us on

ఎన్నికలకు టైం ఉన్నా .. తిరుపతి సెంట్రిక్ గా వైసీపీ, జనసేన మధ్య రాజకీయం వేడేక్కింది. పవన్ కల్యాణ్ పై  పర్యాటక శాఖ మంత్రి రోజా చేసే విమర్శలకు తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్‌ కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి రోజాను దూషించారన్న కేసులో తాజాగా కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తిరుపతిలో అదుపులోకి తీసుకొని నగరి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఉదయం CRPC 41 నోటీష్ ఇచ్చి బెయిల్ పై విడుదల చేశారు. కోర్టు నుంచి విడుదలయ్యాక నగరిలోని మంత్రి రోజా ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు జనసేన నేతలు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై తొడగొట్టి మంత్రికి సవాల్ విసిరారు.

తనను ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కూర్చోబెట్టారో… అక్కడే  రోజాను 18 నెలలు తిరిగే లోగానే కూర్చోబెడతానని పేర్కొన్నారు. తన అరెస్ట్ వెనుక రోజాతో పాటు,  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలు ఉన్నారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిరణ్ రాయల్. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని మండిపడ్డారు. ఓ ఉగ్రవాది కంటే కూడా దారుణంగా పోలీసులు ట్రీట్ చేశారని కిరణ్ వాపోయారు. నగరి అభివృద్ధి మీద సవాల్ విసిరితే స్వీకరించకుండా కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు కిరణ్ రాయల్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ మంత్రిపై కంటైన్మెంట్ అథారిటీ కేసు వేస్తామని చెప్పారు. అరెస్ట్ సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఫోన్ ద్వారా మంత్రి రోజా తనతో మాట్లాడినట్లు కిరణ్ తెలిపారు. తనను దూషించినందుకే అరెస్ట్ చేస్తున్నారని ఆమె ఫోన్‌లో చెప్పారన్నారు. పవన్ కల్యాణ్‌ను పర్సనల్ టార్గెట్ చేసి దూషించినందుకే.. తాను బదులిచ్చినట్లు తెలిపారు.

ఇలాంటి తప్పుడు కేసులకు భయపడేదే లేదన్నారు జనసేన నాయకులు. కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నాయకులకు ఇక నుంచి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. మాపార్టీ సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు తిరుపతి జనసేన నేతలు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..