Pawan Kalyan: సత్తెనపల్లిలో టెన్షన్ టెన్షన్.. పవన్ పర్యటనతో పొలిటికల్ హీట్.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి

గుంటూరు జిల్లా నివురు గప్పిన నిప్పులా మారింది. మాచర్ల, తెనాలి ఘటనలకు తోడు.. ఇప్పుడు జనసేనాని పర్యటన ఏపీ పాలిట్స్ లో సెగలు పుట్టిస్తోంది. సత్తెనపల్లిలో జరగనున్న కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్...

Pawan Kalyan: సత్తెనపల్లిలో టెన్షన్ టెన్షన్.. పవన్ పర్యటనతో పొలిటికల్ హీట్.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి
Ambati Rambabu Sattenapalle

Updated on: Dec 18, 2022 | 12:19 PM

గుంటూరు జిల్లా నివురు గప్పిన నిప్పులా మారింది. మాచర్ల, తెనాలి ఘటనలకు తోడు.. ఇప్పుడు జనసేనాని పర్యటన ఏపీ పాలిట్స్ లో సెగలు పుట్టిస్తోంది. సత్తెనపల్లిలో జరగనున్న కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గమైన సత్తెనపల్లి. ఇటీవల పవన్‌ను టార్గెట్ చేసుకుని అంబటి రాంబాబు ఎన్నో విమర్శలు, ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఎలాంటి ప్రసంగం చేయనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే పవన్‌ను అసలు రాజకీయ నాయకుడిగానే చూడటం లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన వేరే ఎవరి కోసమో పనిచేసే వీకెండ్ లీడర్ అంటూ ఆరోపించారు. పవన్‌ను చూసి భయపడాల్సిన అవసరం తమ పార్టీకి లేదంటున్నారు.

జససేన అధ్యక్షుడు కౌలు రైతు భరోసా యాత్రలో పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు వివరాలు వెల్లడించారు. కౌలు భరోసా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పవన్‌ కల్యాణ్‌ రూ.లక్ష చొప్పున రూ. 3 కోట్లు అందించనున్నారన్నారు. అనంతరం సత్తెనపల్లిలో పవన్ కల్యాణ్ సభలో పాల్గొంటారు. పార్టీలో చేరికలు ఉంటాయంటూ ప్రచారం పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం కావడం, అక్కడే పవన్ కల్యాణ్ కౌలు భరోసా యాత్ర చేపట్టడం గమనార్హం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..