AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: అప్పుల ఊబిలో ఉన్న రైతులను ప్రభుత్వమే రక్షించాలి.. అన్నదాతకు ఇచ్చిన హామీ ఏమైందన్న జనసేనాని

Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాతకు పెట్టుబడుల విషయంపై ఇచ్చిన హామీ ఏమైంది అంటూ జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా (Social Media) వేదికగా..

Pawan Kalyan: అప్పుల ఊబిలో ఉన్న రైతులను ప్రభుత్వమే రక్షించాలి.. అన్నదాతకు ఇచ్చిన హామీ ఏమైందన్న జనసేనాని
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Apr 19, 2022 | 1:53 PM

Share

Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాతకు పెట్టుబడుల విషయంపై ఇచ్చిన హామీ ఏమైంది అంటూ జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా (Social Media) వేదికగా ప్రశ్నించారు. అప్పుల ఊబిలో ఉన్న రైతులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. రైతు ఉసురు తీసుకొనే పరిస్థితి రాకుండా వ్యవస్థలు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిత్యం ఏదొక ప్రాంతంలో అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు. పల్నాడు, నంద్యాల, కర్నూలు ఇలా అనేక జిల్లాలో అప్పుల భారంతో రైతులు  ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  బాధిత రైతుల కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నపాటి కమతాలు ఉన్నా ప్రధానంగా కౌలు వ్యవసాయం మీద ఆధారపడిన ఈ రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం త్రీ మెన్ కమిటీ సత్వరమే స్పందించాలని కోరారు జనసేనాని. ప్రభుత్వం రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకుండా పనిచేయాలని.. విధులు నిర్వహించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయని అన్నారు.

వైసీపీ నాయకత్వం ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు పంట పెట్టుబడిగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రచారం చేశారు. ఇప్పటి వరకూ ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 వేలు చొప్పున పంట పెట్టుబడి ఇచ్చారు? అసలు ఆ హామీ ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట డబ్బులు సకాలంలో చెల్లించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. పంట అమ్మినా ఆ సొమ్ములు చేతికి రాకపోవడంతో.. నెక్స్ట్ పంట వేయడానికి పెట్టుబడికి రైతులకు డబ్బులేక అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బ్యాంకులు, సహకార సంఘాల నుంచి రుణాలు అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి కౌలు ఊబిలో కూరుకుపోతున్నారని వాపోయారు పవన్ కళ్యాణ్.

రైతులను అప్పుల భారం నుంచి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. పంటకు పెట్టుబడి లేదు, రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకోరు, నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించరు, పండిన పంట తీసుకొని కూడా డబ్బులు ఇవ్వరు… ఏ దశలోనూ వైసీపీ రైతులకు అండగా నిలబడటం లేదు. ఈ ప్రభుత్వం చేసింది ఒక్కటే అన్నం పెట్టే రైతులకు కూడా కులాలవారీగా విభజించటమే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీ ఇప్పటికే కౌలు రైతుల కుటుంబాలను ఆదుకొనే దిశగా అడుగులు వేస్తోంది. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో చోటు చేసుకున్న కౌలు రైతుల ఆత్మహత్యల ఘటనల్లో ప్రతి ఒక్కరికీ రూ.7 లక్షల పరిహారం అందేలా పోరాడుతుంది. కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పక్షాన భరోసా కల్పిస్తామని అన్నారు.

Also Read: భారతసైన్యంలో ఇంటిదొంగలు.. వాట్సాప్‌ సందేశాలతో చైనా,పాక్‌కు సమాచారం చేరవేస్తునట్టు గుర్తింపు

Summer Travel Tips: సమ్మర్ టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా..? అయితే వీటిని మీ వెంటే ఉంచుకోండి..