Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన జనసేనాని.. 3రోజులపాటు సాగనున్న క్యాంపెయిన్..

|

Dec 18, 2021 | 11:49 AM

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. తన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant    

Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన జనసేనాని.. 3రోజులపాటు సాగనున్న క్యాంపెయిన్..
Pawan Kalyan Steel Plant
Follow us on

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. తన గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మళ్ళీ విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉక్కుపరిశ్రమ ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విశాఖ ఉక్కు పరిరక్షణకై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన ఈరోజు నుండి మూడు రోజుల పాటు డిజి టల్ క్యాంపెయిన్ చేయనున్నారు. #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant    పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని ఎంపీలు విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమం చేయాలంటూ హ్యాష్ టాగ్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. 

ఈ క్యాంపెయిన్ కు ఇప్పటికే జనసేనాని విధివిధానాలను ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీలకు బాధ్యత గుర్తు చేయాలన్న డిమాండ్ తో జనసేన డిజిటల్ క్యాంపైన్ ను చేపట్టింది. వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖలోని ఉక్కు పరిశ్రమని ప్రయివేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ.. జనసేనాని మంగళగిరిలో ఇప్పటికే ఒక్కరోజు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకుని వెళ్ళమని మళ్ళీ సూచించారు.  ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనసేన అధినేత ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం పోరాటం మొదలు పెట్టారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను ఢిల్లీ తీసుకుని వెళ్లి.. మన గళం వినిపించాలంటూ జనసేనాని డిమాండ్ చేశారు.

Also Read:   ఇంట్లో ఫిష్ అక్వేరియం ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా.. లేదంటే కలతలు మీ చెంతే..