Pawan Kalayan: ఉపాధిలేని యువత డ్రగ్స్ దందాలో చిక్కుకుంటున్నారు.. గంజాయి వ్యాపారానికి అడ్డు కట్టవేయాలంటున్న పవన్ కళ్యాణ్

|

Oct 29, 2021 | 9:27 AM

Pawan Kalayan: ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పలు రాష్ట్రాల పోలీసు అధికారులు చెప్పిన విషయాలను..

Pawan Kalayan: ఉపాధిలేని యువత డ్రగ్స్ దందాలో చిక్కుకుంటున్నారు.. గంజాయి వ్యాపారానికి అడ్డు కట్టవేయాలంటున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan
Follow us on

Pawan Kalayan: ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పలు రాష్ట్రాల పోలీసు అధికారులు చెప్పిన విషయాలను షేర్ చేశారు. తాను ఇదే విషయాన్నీ 2018 లో విశాఖ జిల్లా మన్యం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ప్రస్తావిస్తున్న విషయాన్ని మళ్ళీ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు జనసేనాని.  అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఈ ముప్పును అరికట్టాలని సూచించారు. ఈ వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేయడానికి పటిష్టమైన చట్టాన్ని అమలు చేయడం అవసరం ఉందని అన్నారు. అంతేకాదు..ఓ వైపు గంజాయి వ్యాపారానికి అడ్డు కట్టవేస్తూ.. మరోవైపు యువతకు సమాన ఉపాధి అవకాశాలను సమాంతరంగా సృష్టించాలని సూచించారు.

2018 నుండి ఆంధ్రప్రదేశ్ యువత పైన మాదకద్రవ్యాల ప్రభావం గురించి జనసేనాని పవన్ కళ్యాణ్  చెప్తూనే ఉన్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది.. ఇప్పుడు తారా స్థాయికి చేరిందని కామెంట్ జత చేస్తున్నారు.

గంజాయి సాగు నిజంగా సమాజంపై ప్రభావం చూపిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతేకాదు.. యువత ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. ముఖ్యంగా విశాఖ మన్యం నుంచి తుని వరకూ ఉపాధి లేని చదువు పూర్తి అయిన కుర్రాళ్ళు ఈ ట్రేడ్ లో చిక్కుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువత కాసుల కోసం చేస్తున్న పనులతో పోలీసులకు చిక్కి.. భవిష్యత్ ను కోల్పోతున్నారని.. అయితే కింగ్ ప్రిన్స్ మాత్రం రిక్స్ లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారని ఎద్దేవా చేశారు జనసేనాని.

Also Read:  కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు ఋణం పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..