మనసుదోచుకుంటున్న మన్యం.. విశాఖలో మంచు అందాలకు టూరిస్టులు ఫిదా..!! వీడియో
విశాఖ జిల్లా ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు.
విశాఖ జిల్లా ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఏజెన్సీలోని మేఘాల కొండగా పేరు పొందిన పాడేరు మండలం వంజంగి కొండపై పర్యాటకుల తాకిడి నెలకొంది. పొగమంచు కురుస్తుండడంతో గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు అందాలను వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు చేరుకుంటున్నారు. తెల్లవారు జామున కురిసే దట్టమైన మంచుకి గిరి శిఖరాలు పాల సముద్రాన్ని తలపింస్తున్నాయి. వంజంగి హిల్స్‌లోని మేఘాల కొండకు చేరుకుని పర్యాటకులు మంచు అందాలను తమ కెమెరాలలో బంధిస్తున్నారు. సూర్యోదయం వేళ అక్కడి ప్రకృతి అందాలకు వారంతా ఫిదా అవుతూ సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని వీక్షించి తన్మయత్వం పొందున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సింగర్‌గా మారిన ఎమ్మెల్యే.. నెట్టింట వీడియో వైరల్
ఈ దొంగకు తొందరెక్కువ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ వీడియో