ఇంట్లో నాగు పాము.. నాగుపాము బుస కొడితే ఇలా ఉంటుందా..  వీడియో

ఇంట్లో నాగు పాము.. నాగుపాము బుస కొడితే ఇలా ఉంటుందా.. వీడియో

Phani CH

|

Updated on: Oct 29, 2021 | 9:14 AM

పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాముగా నాగు పాముకు పేరుంది. పొరపాటున నాగు పామును కవ్వించడానికి ప్రయత్నించామో ఇక అంతే సంగతులు బుస కొట్టే చప్పుడుకే భయపడాల్సిందే.

పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాముగా నాగు పాముకు పేరుంది. పొరపాటున నాగు పామును కవ్వించడానికి ప్రయత్నించామో ఇక అంతే సంగతులు బుస కొట్టే చప్పుడుకే భయపడాల్సిందే. అయితే సాధారణంగా పాములు ఏక్కడో చెట్ల మధ్యలో, పొదల మధ్యలో చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది ఇంటిలోకి వచ్చి, డోర్‌ సందుల్లో తిష్ట వేసుకుంటే ఎలా ఉంటుంది.? ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది కదూ! కానీ ఇది నిజంగానే జరిగింది. నేపాల్‌లోని ఘోరాహీ అనే పట్టణంలోని ఇంట్లోకి కోబ్రా వచ్చింది. వచ్చిన పాము వచ్చినట్లు ఉండకుండా, ఇంటి డోర్‌ సందుల్లోకి వెళ్లి బయటకు పడగవిప్పి చూస్తోంది. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆ పామును వీడియో తీయడం ప్రారంభించారు. నన్నే వీడియో తీస్తారా.? అనుకుందో ఏమో.. ఒక్కసారిగా గట్టిగా బుస కొట్టింది. అయితే వీడియో తీస్తున్న వారు ఏ మాత్రం భయపడకుండా వీడియో తీయడం కంటిన్యూ చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

 

Corona Virus: మూడో ముప్పు వైపుగా కరోనా కొత్త వేరియంట్‌.. లైవ్ వీడియో

News Watch: నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుల్ని..అగ్గితోటి కడుగు మన రాజకీయ వ్యవస్థల్ని.. వీడియో