ఔదార్యం చాటుకున్న పవన్ కల్యాణ్.. ఆ కార్యకర్త కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం

|

Mar 05, 2022 | 8:30 PM

టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్. ఆయన చేసే సినిమాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కారణంగానూ అభిమానులు ఆయన్ని ఇష్టపడుతుంటారు....

ఔదార్యం చాటుకున్న పవన్ కల్యాణ్.. ఆ కార్యకర్త కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం
Pawan Kalyan
Follow us on

టాలీవుడ్‌లో ఉన్న హీరోల్లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌(Pawan Kalyan)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ డిఫరెంట్. ఆయన చేసే సినిమాలు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కారణంగానూ అభిమానులు ఆయన్ని ఇష్టపడుతుంటారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తాను ఎన్నో సందర్భాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం(Amalapuram) నియోజకవర్గంలోని జనుపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త తవిటికి వెంకటేశ్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. జనసేన పార్టీలో మొదటి నుంచి నిబద్ధత కలిగిన కార్యకర్త(activist)గా సేవలందించిన వెంకటేశ్ కు సహాయం అందించాలని తలచారు. ఈ మేరకు బీమా లేకున్నా ఆ కార్యకర్తకు రూ.5 లక్షలు ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారుర. పార్టీ కార్యకర్తలు, నేతలకు ఏదైనా సమస్య వస్తే తానున్నానంటూ అభయం ఇస్తున్నారు.

గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ భారీ బ్యానర్‌ను కడుతూ విద్యదాఘాతానికి గురై మరణించిన ముగ్గురు అభిమానుల కుటుంబాలను ఆదుకోవడానికి, భారీగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముందుగా ప్రకటించిన రెండు లక్షల రూపాయల మొత్తాన్ని భారీగా పెంచి, ఒక్కో కుటుంబానికి 12.5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని చెల్లించారు. జనసేన పార్టీ అంతా ఓ కుటుంబంలా ఉంటుందని, ఎవరికి ఇబ్బంది వచ్చినా స్పందిస్తుందని పేర్కొందని పార్టీ కార్యాలయం పేర్కొంది.

Also Read

Viral Video: కుక్క నోరు మూయించిన కప్ప !! వీడియో వైరల్‌

Hero Surya : తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది ఆయన సినిమాలే.. ఆసక్తికర కామెట్స్ చేసిన సూర్య

అసెంబ్లీ సమావేశాల్లో ఆ మూడు అంశాలను లేవనెత్తుతాం.. వైసీపీకి టీడీపీ వార్నింగ్