Pawan Kalyan: ఏపీ గంజాయి హబ్‌గా మారింది.. వివిధ రాష్ట్రాల పోలీస్ అధికారుల వీడియోలు షేర్ చేసిన పవన్

|

Oct 27, 2021 | 1:20 PM

Pawan Kalyan: జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2018లో చేసిన..

Pawan Kalyan: ఏపీ గంజాయి హబ్‌గా మారింది.. వివిధ రాష్ట్రాల పోలీస్ అధికారుల వీడియోలు షేర్ చేసిన పవన్
Pawan Kalyan
Follow us on

Pawan Kalyan: జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను 2018లో చేసిన పోరాట యాత్ర రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకునేందుకు ఉద్దేశించబడిందని తెలిపారు. అంతేకాదు ‘ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు’లోని గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, ‘గంజాయి వ్యాపారం తో పాటు గంజాయి మాఫియా’ గురించి తనకు అనేక ఫిర్యాదులు అందాయని జనసేనాని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

నల్గొండ ఎస్పీ రంగనాధ్

అంతేకాదు ఏపీ గంజాయి హబ్ గా మారుతుందని.. ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుందంటూ నల్గొండ ఎస్పీ రంగనాధ్ చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఏపీ నార్కోటిక్స్ హబ్‌గా మారింది అంతేకాదు ప్రతి స్థాయిలో చాలా మంది డ్రగ్స్ లార్డ్‌లతో నిండిపోయింది. ఇది దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నాయకులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని తెలంగాణ లోని నల్గొండ ఎస్పీ రంగనాధ్ మాటలతో అర్ధమవుతుంది’’ అని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అంతేకాదు రంగనాథ్ గంజాయి పై మాట్లాడిన ఓ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

హైదరాబాద్ సిటీ-పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్

ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు మాదకద్రవ్యాలు రవాణా అవుతున్నాయని హైదరాబాద్ సిటీ-పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ చేసిన కామెంట్స్ ను పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు. అంతేకాదు ఏపీనుంచి గంజాయి ఎలా రవాణా చేయబడుతున్నాయో అంజన్ కుమార్ చెప్పిన వివరాలున్న ఓ వీడియో పోస్ట్ చేశారు

ఏపీ నార్కోటిక్ హబ్ ఆఫ్ ది నేషన్ గా మారిందని కర్ణాటక లోని బెంగళూరు కు చెందిన కమల్ పంత్ వెల్లడించారు. ఇదే విషయాన్నీ జనసేనాని తన ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ.. కమల్ పంత్ మాట్లాడి ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

Also Read:  భర్త, మామ మృతి.. కుటుంబం కోసం రైతుగా మారిన ఓ మహిళ.. ఏటా రూ.25 లక్షల సంపాదన