ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్ర సభలో.. ముఖ్యమంత్రి జగన్‌పై, వైసీపీ నేతలపై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పీఠానికి విలువ ఇస్తాను.. జగన్‌కు కాదని.. వైసీపీ నాయకులు నా కుటుంబం గురించి, బిడ్డల గురించి చెడుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకనుంచి ముఖ్యమంత్రిని, వైసీపీ నాయకులను నువ్వు అని ఏకవచనంతో మాట్లాడతానని ధ్వజమెత్తారు. సీఎం పదవికి జగన్ అర్హుడు కాదని.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి సరైనదని కాదని ఆరోపించారు. ఏలూరులో వరదలు వస్తే ఎందుకు మునిగిపోతుందని.. రక్షణ గొడలు ఏమయ్యాయని స్పందించారు.
సీఎం జగన్‌కు మనం బానిసలం కాదని.. ఆయన మనలో ఒకరని అన్నారు. మన కష్టంతో కట్టే పన్నులకు, ఖజానాకు సీఎం జవాబుదారీ అని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ఖజానా రూ.10 లక్షల కోట్లని.. వాటిని ఎలా ఖర్చు పెట్టాలో సీఎం మనకు చెప్పాలన్నారు. జగన్ రూ.లక్షా 18 వేల కోట్ల అప్పు తీసుకొని ఎందుకు ప్రజలకు లెక్క చెప్పలేదని ప్రశ్నించారు. కాగ్ ఆయన్ని ఎందుకు ప్రశ్నించిందని నిలదీశారు. అలాగే రూ.22 వేల కోట్ల లిక్కర్ బాండ్లపై అప్పు తీసుకొని ఆ డబ్బుని ఏం చేశారని అడిగారు. రోడ్ డెవలాప్‌మెంట్ కార్పొరేషన్ డబ్బులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..