Pawan Kalyan: నూకాలమ్మ మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్.. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా..

| Edited By: Shaik Madar Saheb

Jun 10, 2024 | 4:30 PM

అధికారంలోకి కూటమి వస్తే ముందుగా నూకాలమ్మ దర్శనం చేసుకుని ముక్కులు చెల్లించాకే పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో చెప్పిన పవన్ కళ్యాణ్.. గెలిచిన వెంటనే రాష్ట్రంలో మొదటి పర్యటనను అదే పెట్టుకున్నారు.. నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్..

Pawan Kalyan: నూకాలమ్మ మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్.. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా..
Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బంపర్ మెజారిటీతో గెలుపొందింది.. 12న కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఎలాంటి హాడావుడి లేకుండా.. సైలెంట్ గా అనకాపల్లిలో పర్యటించి నూకాలమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే.. ఎక్కడా ఎలాంటి హాడావుడి లేకుండా, ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా పవన్ పర్యటించారు. కూటమి అధికారంలోకి వస్తే ముందుగా నూకాలమ్మ దర్శనం చేసుకుని ముక్కులు చెల్లించాకే పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో చెప్పిన పవన్ కళ్యాణ్.. గెలిచిన వెంటనే రాష్ట్రంలో మొదటి పర్యటనను అదే పెట్టుకున్నారు.. నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రధాని ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ కల్యాణ్.. ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనకాపల్లి వెళ్లి నూకాలమ్మని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు.

హంగు ఆర్భాటం లేకుండా పవన్ పర్యటన

తిరుగులేని విజయం సాధించి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటనలపై ప్రజల్లో మరింత ఆసక్తి నెలకొంది. గతంలోనే పవన్ ఎక్కడికి వచ్చినా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు తరలి రావడం కనిపిస్తుంది. దానిని తోడు ప్రస్తుతం అధికారంలోకి వచ్చారు.. కాబట్టి సాధారణంగానే ప్రజల్లో పవన్ పాత్ర, పర్యటనలపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ తన పర్యటన వేళ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చూసే ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.

వీడియో చూడండి..

ఎక్కడా కూడా కనీస సమాచారం బయటకు పోక్కకుండా ఆయన విశాఖలో ఏర్పాట్లు చేరుకున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వచ్చేవరకు ఆయన పార్టీ నేతలకు కూడా సమాచారం లేదు. ఎయిర్పోర్ట్ అధికారుల ద్వారా మీడియాకు సమాచారం ఉన్నా, ఆయన వచ్చే సమయం ఖచ్చితంగా తెలియలేదు. పార్టీ నేతలను కూడా ఎయిర్ పోర్ట్ కు కూడా రావద్దని పవన్ సూచించినట్లు తెలుస్తోంది..

అదే సమయంలో నూకాలమ్మ గుడికి కూడా వస్తున్నట్టుగా కూడా ఎవరికి సమాచారం లేదు.. చివరకు అనకాపల్లి నుంచి విజయం సాధించిన జన సేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు కూడా సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే.. తాను వస్తున్నారని సమాచారం తెలిస్తే పెద్ద హడావుడి అవుతుందని, ఈ పరిస్థితుల్లో అది అంత మంచిది కాదన్న ఉద్దేశంతోనే పవన్ రహస్యంగానే, ప్రచారానికి దూరంగా ఈ పర్యటన చేపట్టినట్టు సమాచారం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..