Andhrapradesh: సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ఇదే.. నెలల వారీగా పథకాలు–కార్యక్రమాలు

|

Apr 13, 2021 | 5:00 PM

ఏపీలోని జగన్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, పథకాల అమలులో...

Andhrapradesh: సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ఇదే..  నెలల వారీగా పథకాలు–కార్యక్రమాలు
CM-Jagan
Follow us on

ఏపీలోని జగన్ సర్కార్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కోవిడ్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, పథకాల అమలులో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ఎన్నికల ముందు చెప్పిన పలు హామీలను ఈ 22 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసింది. పథకాలు, కార్యక్రమాలపై పక్కాగా క్యాలెండర్‌ రూపొందించి మరీ వాటిని అమలు చేస్తుంది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రచురించిన 2021–2022 (ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు) క్యాలెండర్‌లో కూడా ప్రభుత్వం ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది పొందుపర్చారు.

క్యాలెండర్‌ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను, రెండో పేజీలో గత 22 నెలల కాలంలో అంటే, 2019 జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏయే పథకాలలో ఎంత మందికి, ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారన్న వివరాలను పొందుపర్చారు. మూడో పేజీలో అవ్వాతాతలకు ఆసరాగా అందిస్తున్న వైఎస్సార్‌ ఆసరా పింఛను కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరసగా ఏ నెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది వివరించారు.

నెలల వారీగా పథకాలు–కార్యక్రమాలు:

ఏప్రిల్‌–2021:

– జగనన్న వసతి దీవెన మొదటి విడత. జగనన్న విద్యా దీవెన మొదటి విడత . రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ (2019-రబీ). పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ చెల్లింపులు.

-ఇవి కాకుండా రెగ్యులర్‌గా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక అమలు

మే–2021:

– వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా (2020- ఖరీఫ్‌). వైఎస్సార్‌ రైతు భరోసా మొదటి విడత. మత్స్యకార భరోసా (వేట నిషేధ సబ్సిడీ). మత్స్యకార భరోసా (డీజిల్‌ సబ్సిడీ)
– ఇవి కాకుండా పైన చెప్పిన అన్ని రెగ్యులర్‌ పథకాలు అమలు.

జూన్‌–2021:

– వైయస్సార్‌ చేయూత, జగనన్న విద్యా కానుకతో పాటు, రెగ్యులర్‌ పథకాలు.

జూలై–2021:

– జగనన్న విద్యా దీవెన రెండో విడత. వైయస్సార్‌ కాపు నేస్తం. వైయస్సార్‌ వాహనమిత్ర. ఇంకా రెగ్యులర్‌ పథకాలు.

ఆగస్టు–2021:

– రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు (2020-ఖరీఫ్‌), ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్‌ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు. వైయస్సార్‌ నేతన్న నేస్తం, అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు. ఇంకా రెగ్యులర్‌ పథకాలు.

సెప్టెంబరు–2021:

– వైఎస్సార్‌ ఆసరాతో పాటు, రెగ్యులర్‌ పథకాలు.

అక్టోబరు–2021:

– వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత. జగనన్న చేదోడు (రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణులు). జగనన్న తోడు (చిరు వ్యాపారులు). ఇంకా రెగ్యులర్‌ పథకాలు.

నవంబరు–2021:

– వైఎస్సార్‌ ఈబీసీ నేస్తంతో పాటు, రెగ్యులర్‌ పథకాలు.

డిసెంబరు–2021:

– జగనన్న వసతి దీవెన రెండో విడత. జగనన్న విద్యా దీవెన మూడో విడత. వైఎస్సార్‌ లా నేస్తం. రెగ్యులర్‌ పథకాలు.

జనవరి–2022:

– వైఎస్సార్‌ రైతు భరోసా మూడో విడత. జగనన్న అమ్మ ఒడి. పెన్షన్‌ పెంపు. ఇక నుంచి నెలకు రూ.2500. ఇంకా రెగ్యులర్‌ పథకాలు.

ఫిబ్రవరి–2022:

– జగనన్న విద్యా దీవెన నాలుగో విడత. రెగ్యులర్‌ పథకాలు

Also Read: ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే… నాలుగు చుట్టుముట్టాయి..ఇక

పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి