YS Jagan: వ్యక్తిగత భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్

|

Aug 05, 2024 | 7:58 PM

కూటమి ప్రభుత్వం కావాలనే టార్గెట్‌ చేస్తోంది. ఓ మాజీ సీఎంకి రిపేర్‌లో ఉన్న వెహికిల్‌ ఇస్తారా...? అంటూ వైసీపీ అధినేత జగన్‌ హైకోర్టును ఆశ్రయించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

YS Jagan: వ్యక్తిగత భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన జగన్
YS Jagan
Follow us on

తనకు సెక్యూరిటీ పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు సరిగా సెక్యూరిటీ కల్పించట్లేదని… తనకు కేటాయించిన వాహనం కూడా సరిగా లేదంటూ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తనకు ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్‌ జగన్‌ పిటిషన్‌లో కోరారు. రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని తనకు ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని ఆధారాలు అందజేశారు. ఇక జగన్‌ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం…త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక కావాలనే తనను కూటమి ప్రభుత్వం..  టార్గెట్‌ చేస్తుందని ఫైర్ అయ్యారు జగన్.

జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు హై సెక్యూరిటీ ఉండేది. తాడేపల్లి నివాసం దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీ పనిచేసేది. జగన్‌ ఇంటికి వెళ్లే దారిలోనూ చెక్‌ పోస్టులు ఉండేవి. సుమారు 300 మంది రక్షణలో జగన్‌ ఉండేవారు. అయితే ఏపీలో పాలన మారడంతో.. ఆయన సెక్యూరిటీ విషయంలోనూ మార్పులు జరిగాయి. పెద్ద ఎత్తున సెక్యూరిటీని తొలగించారు. దీంతో ప్రైవేట్‌ సెక్యూరిటీని పెట్టుకున్న ఆయన… ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా… కావాలనే తన సెక్యూరిటీ విషయంలో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలన్నారు. ప్రాణహాని ఉన్న అంశాన్ని కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ… హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా… సెక్యూరిటీ విషయంలో జగన్‌ హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..