టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు..!

|

Apr 03, 2019 | 7:05 PM

కడప: ఏపీలో వరస ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. కడప జిల్లాలోని  మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థి సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుధాకర్ ఇంటి నుంచి అధికారులు కొన్ని కీలక పత్రాల, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ ఐటీ దాడులు రాజకీయ కారణాలతోనే జరుగుతున్నాయని సుధాకర్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నికలకు 8 రోజుల ముందు సుధాకర్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంతో […]

టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు..!
Follow us on

కడప: ఏపీలో వరస ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. కడప జిల్లాలోని  మైదుకూరు తెలుగుదేశం అభ్యర్థి సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ప్రొద్దుటూరులోని ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుధాకర్ ఇంటి నుంచి అధికారులు కొన్ని కీలక పత్రాల, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ ఐటీ దాడులు రాజకీయ కారణాలతోనే జరుగుతున్నాయని సుధాకర్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కాగా ఎన్నికలకు 8 రోజుల ముందు సుధాకర్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించడంతో సర్వత్రా చర్చకు దారి తీసింది. మరోవైపు సుధాకర్ యాదవ్.. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు.