AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NT Rama Rao: ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారానికి 40 ఏళ్లు.. ఎన్టీఆర్‌ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి ఎంతో మంది అభిమానులున్నారు. 1983 జనవరి 9వ తేదీన తెలుగువారి చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు..

NT Rama Rao: ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారానికి 40 ఏళ్లు.. ఎన్టీఆర్‌ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Nt Rama Rao
Subhash Goud
|

Updated on: Jan 09, 2023 | 10:20 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి ఎంతో మంది అభిమానులున్నారు. 1983 జనవరి 9వ తేదీన తెలుగువారి చరిత్రలో మర్చిపోలేని రోజు ఇది. పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు ఏపీ ముఖ్యమంత్రిగా ఇదే రోజు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి సరిగ్గా 40 ఏళ్లు కావస్తోంది. కాంగ్రెస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి వినిపించాలనే పిలుపుతో టీడీపీకి అంకురార్పణ చేసిన మహానీయుడు ఎఆన్టీఆర్‌. పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధించి ఏపీకి తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారి పోటీల్లోనే 200 సీట్లు సాధించిన ఘనత ఎన్టీఆర్‌ది.

ఆ తర్వాత అంటే 1984 ఆగస్టు 15న నాందెండ్ల భాస్కర్‌రావు కారణంగా పదవిని కోల్పోయారు ఎన్టీఆర్‌. ఫలితంగా నాదెండ్లతో పాటు అప్పటి గవర్నర్ రామ్‌లాల్ చరిత్రహీనులుగా నిలిచిపోయారు. నాటి వెన్నుపోటుకు ప్రజా పోరాటంతో నెలరోజుల్లోనే గద్దె దింపగలిగారు ఎన్టీ రామారావు. 1984 సెప్టెంబర్ 16న మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇక కొంత కాలం తర్వాత అసెంబ్లీని రద్దు చేసి 1985 మార్చి నెలలో ఎన్నికలకు వెళ్లి మరోసారి 200పైగా సీట్లు సాధించారు. మార్చి 9న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా వరుసగా 1983,1984,1985లో మూడు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీ రామారావు. ఇక 1989 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష నేతగా నిలిచారు. నేషనల్‌ ఫ్రంట్‌ స్థాపనలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషించారు. తిరిగి 1994 జరిగిన ఎన్నికల్లో మరోసారి 220 సీట్లు సాధించి విజయం సాధించారు. 1995లో రెండోసారి చంద్రబాబు చేతిలో పదవి కోల్పోయారు.

ఎన్టీఆర్‌ హయాంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు..?

☛ ఆంధ్రప్రాంతంలో మునసబు, కరణాల వ్యవస్థను, తెలంగాణలో పటేల్‌, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు.

☛ వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్‌ ఫీజు రద్దు చేశారు. అలాగే సీట్లను అమ్ముకోవడాన్ని నిషేధించారు.

☛ ఇంజనీరింగ్‌, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్‌ను తీసుకువచ్చారు.

☛ 1983 ఏప్రిల్‌ 14న రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు.

☛ మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

☛ ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధించారు.

☛ దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ విధానాన్ని రద్దు చేశారు.

☛ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చట్టాన్ని చేశారు ఎన్టీఆర్. ఆ చట్టం చేసిన మొదటి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌. ఆ తర్వాత 20 సంవత్సరాలకు కేంద్రం అలాంటి చట్టాన్ని తీసుకువచ్చింది.

☛ ఎస్సీలకు 1 శాతం, బీసీలకు 2 శాతం రిజర్వేషన్లు పెంచారు.

☛ కంప్యూటర్లను వినియోగంలో తీసుకువచ్చారు.

☛ కేంద్ర ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణలు చేయడానికి చాలా సంవత్సరాల ముందే ఎన్టీఆర్‌ అధికార వికేంద్రీకరణ చేశారు. తాలూకాలు, బ్లాక్‌లకు బదులు రెవెన్యూ మండలాలు, మండల పరిషత్‌లను ఏర్పాటు చేసిన ఘనట ఎన్టీఆర్‌దే.

☛ జిల్లా, మండల పరిషత్‌, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు.

☛ భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ కార్యక్రమం

☛ పేదలకు జనతా వస్త్రాల పథకాన్ని ప్రారంభించి సగం ధరకే దుస్తులను పంపిణీ చేశారు.

ఇవే కాకుండా మరెన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి