YS Sunitha: రాజకీయ రంగప్రవేశానికి స్వాగతం.. ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్ల కలకలం..

| Edited By: Ravi Kiran

Apr 25, 2023 | 3:50 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు.. వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన పోస్టర్లతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది.

YS Sunitha: రాజకీయ రంగప్రవేశానికి స్వాగతం.. ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్ల కలకలం..
Ys Sunitha Reddy
Follow us on

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు.. వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వ్యక్తులు వేసిన పోస్టర్లతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. YS సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ ఆ పోస్టర్లతో ఉంది. ప్రొద్దుటూరు YMR కాలనీ ఆంజనేయస్వామి గుడి దగ్గర టీస్టాల్ గోడలపై ఈ పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లలో తెలుగుదేశంపార్టీ అని ఉంది. అలాగే YS సునీతతోపాటు.. ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, తండ్రి YS వివేక ఫొటోలు కూడా పోస్టర్లలో ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు డాక్టర్‌ సునీత పోరాటం చేస్తున్న సమయంలో ఈ పోస్టర్లు వేయడం చర్చగా మారింది. అయితే విషయం తెలిసి ఆ పోస్టర్లను పోలీసులు తొలగించారు.

తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు..

కాగా.. కడప ప్రొద్దుటూరులో వైయస్ సునీత పోస్టర్లపై ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారు. వివేక హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు అంటించారంటూ పేర్కొన్నారు. వైఎస్ సునీత పోస్టర్లు ఎవరు అంటించారో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సునీతతో పాటు పోస్టర్లో టీడీపీ నేతల ఫొటోలు వేశారు.. ఆ పోస్టర్లతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలాఉంటే.. వైఎస్ వివేకా హత్య కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు మ.2:30కి హైకోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలో సుప్రీం ఆర్డర్ కాపీ అందలేదంటూ అవినాష్ అడ్వొకేట్ తెలిపారు. సుప్రీం వెబ్‌సైట్‌లో ఆర్డర్‌ కాపీ అప్‌లోడ్‌ కాలేదు.. దీంతో ఆర్డర్ కాపీ చూశాకే తీర్పు వెల్లడిస్తామన్న హైకోర్టు స్పష్టంచేసింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి అవినాష్‌రెడ్డి పులివెందులకు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు పులివెందుల చేరుకునే అవకాశం ఉంది. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో అవినాష్‌రెడ్డి ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..