Kurnool: లచ్చిందేవి.. లచ్చిందేవి.. తవ్వకాల్లో దొరికిన ఇనుప బీరువా.. లోపల బంగారం !

| Edited By: Ravi Kiran

Apr 04, 2023 | 6:52 PM

అందులో బంగారం ఉందా..? నగలు ఏమైనా ఉన్నాయా..? కోట్లు విలువ చేసే సంపద ఉందా..? లాకర్ అయితే భారీ బరువు ఉంది. ముగ్గురు, నలుగురు మనుషులు కూడా దాన్ని ఎత్తలేకపోయారు. దీంతో అందులో భారీగానే సంపద ఉందన్న ప్రచారం జరుగుతుంది. అధికారులు ఎప్పుడెప్పుడు దాన్ని ఓపెన్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Kurnool: లచ్చిందేవి.. లచ్చిందేవి.. తవ్వకాల్లో దొరికిన ఇనుప బీరువా.. లోపల బంగారం !
Iron Box
Follow us on

రాయలసీమ… ఒకనాటి రతనాల సీమ. రాయలవారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని చరిత్ర చెపుతోంది. అలాంటి రాయలసీమలోని  కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాత కాలం నాటి బీరువా తవ్వకాల్లో బయటపడింది. స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేస్తుండగా ఇనుప బీరువా కనిపించింది.  పురాతన భవంతి గోడలను జేసీబీలతో పగుల గొడుతుండగా భారీ ఇనుప పెట్టె బయటపడింది. అచ్చం నేటి లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీషులో మద్రాసు అని రాసివుంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. నూతన ఇంటి నిర్మాణం కోసం పాత భవంతిని కూల్చుతుండగా బయటపడ్డ ఈ ఇనుప పెట్టె ఇంచుకూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్‌లో తీసుకొచ్చి, తెరిచేందుకు విఫలయత్నం చేశారు గ్రామస్తులు. భారీ బందోబస్త్‌తో…బ్యాంకు లాకర్‌లకన్నా బలంగా ఉన్న ఈ పెట్టెకు రెండు తాళాలున్నాయి.

ఇది పురాతన కాలానిది కావడంతో ఇందులో భారీగా బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. చుట్టుపక్కలవాళ్లంతా కలిసినా దీన్ని మొయ్యలేకపోయారు. జేసీబీతో దీన్ని బయటకు తెచ్చారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. వాళ్లు దీన్ని పరిశీలించి, ఓపెన్‌ చేసి అందులో ఏముందనేది తేల్చబోతున్నారు.

ఒకవేళ నిధి ఉంటే ఎవరికి చెందుతుంది…

భూమిలో లోపల దాచిన నిధి జాతి వారసత్వ సంపద అయితే గవర్నమెంట్‌కే చెందుతుంది. అటువంటి దానిపై ఎవరికీ ఎలాంటి రైట్స్‌ ఉండవు. ఆ సొత్తు మొత్తం ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుంది. దీనికి సంబందించి 1878లో ఇండియన్‌ ట్రెజర్‌ ట్రోవ్‌ యాక్ట్ అమల్లోకి వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చాక.. ఈ చట్టంలో ఇండియన్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. ఈ యాక్ట్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అమలు చేస్తుంది. గుప్త నిధులు దొరికాయని తెలియగానే  స్థానిక రెవిన్యూ అధికారులు, పోలీసులు స్పాట్‌కు చేరుకుంటారు. అక్కడ దొరికిన సొత్తు మొత్తాన్ని పంచనామా చేసి కలెక్టర్‌కు హ్యాండోవర్ చేస్తారు. అప్పుడు ఆ నిధి వారసత్వ సంపదా? లేదా వారి పూర్వీకులు దాచారా? అనేదానిపై పరిశోధన జరపుతారు. ఆ సంపద దొరికిన ల్యాండ్ ఓనర్స్‌కు చెందిన పూర్వీకులదైతే దాని వారసులెవరన్న దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నిధిని వాటాలుగా విభజించి కలెక్టర్ పంపకాలు జరుపుతారు.

ఒకవేల దొరికిన నిది జాతీయ సంపద అయితే, దొరికిన గుప్త నిధిలో 1/5 వంతు ల్యాండ్ ఓనర్‌కు ఇస్తారు. ఆ భూమిని కలిగి ఉన్న వ్యక్తి  కాకుండా వేరొకరు.. సాగు చేస్తుంటే..  ప్రత్యేక రూల్స్ ప్రకారం కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత భాగం ఇస్తారు. ఏదైనా నిధి దొరికినప్పడు సమాచారాన్ని అధికారులకు తెలియజేయకపోతే సదరు వ్యక్తులు శిక్షార్హులు అవుతారు.

(ఆ బీరువా ఓపెన్ చేశారు అధికారులు. అందులో కేవలం కొన్ని పత్రాలు మినహా.. ఇంకేం లభించలేదు. దీంతో మొత్తం మిస్టరీ అంతా వీడింది.)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..