Fake challan scam: మొదట లక్షలు.. ఇప్పుడు కోట్లు.. ఏపీని షేక్‌ చేస్తున్న చలాన్ల ప్రకంపనలు..

|

Sep 22, 2021 | 5:27 PM

తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మొదట లక్షల్లో అన్నారు. ఇప్పుడు మ్యాటర్‌ కోట్లకు చేరింది. అవినీతి సొమ్ము...

Fake challan scam: మొదట లక్షలు.. ఇప్పుడు కోట్లు.. ఏపీని షేక్‌ చేస్తున్న చలాన్ల ప్రకంపనలు..
Fake Challan
Follow us on

ఏపీ రిజిస్ట్రేషన్‌ శాఖలో ఫేక్‌ చలాన్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మొదట లక్షల్లో అన్నారు. ఇప్పుడు మ్యాటర్‌ కోట్లకు చేరింది. అవినీతి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఫేక్‌ చలాన్లు..! ఇది అనుకున్నంత.. అంచనా వేసినంత చిన్న స్కామ్ఏమీ కాదు. విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలతో కళ్లుబైర్లు కమ్ముతున్నాయి. తనిఖీలు చేసిన కొద్ది పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్లుగా ఫేక్ చలాన్లు బయటపడుతూనే ఉన్నాయి. మొత్తం 45 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ అవినీతి జరిగింది. ఇప్పటి వరకు 11 కోట్ల 34 లక్షల మేర నకిలీ చలానాలు గుర్తించారు. సుమారు 6 కోట్ల 13లక్షలు రికవరీ చేశారు. 30 మంది సబ్ రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకున్నారు. 41 మంది ప్రైవేట్ వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు..6 జిల్లాల్లో 100 శాతం రికవరీ చేశారు అధికారులు.

నకిలీ చలాన్ల పేరుతో కొల్లగొట్టింది ఎంత? ఎవరి జేబుల్లోకి ఎంత సొమ్ము వెళ్లింది.? ప్రభుత్వ ఖజానాకు ఎంత గండిపడింది? బయటపడినవి ఎన్ని? గుట్టుగా సాగిపోయినవి ఎన్ని?ఈ లెక్కలన్నీ తేల్చేపనిలో పడ్డారు అధికారులు. సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను క్యాష్ చేసుకొని దర్జాగా కోట్లు కొల్లగొట్టారు కేటుగాళ్లు. మనల్ని అడిగేదెవరులే అనుకున్నారు. కానీ పంపం పండింది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులే కేంద్రాలుగా సాగిన ఫేక్‌చలాన్ల దందాను టీవీ9 వెలుగులోకి తెచ్చింది. తీగలాగితే డొంకమొత్తం కదిలింది.

విచారణలో నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మ్యాటర్‌ను ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా సీఎం జగన్ ఆరా తీయడంతో అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికైతే సుమారు 12 కోట్లమేర అవినీతి జరిగినట్లు గుర్తించారు. .కరోనా సమయంలో మేన్యువల్‌గా జరిగిన లావాదేవీలనే కేటుగాళ్లు అస్త్రంగా మల్చుకున్నట్లు తేల్చారు. మళ్లీ ఫ్యూచర్‌లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Liquor Shops: మద్యం షాపు యజమానులకు గుడ్‌న్యూస్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న సర్కార్..

Kerala High Court: కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు.. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి..