అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒడిస్సాలోని మల్కాన్ గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు లారిలో గంజాయి తరలిస్తున్నట్టు ముఠా గుట్టురట్టైంది. బియ్యం బస్తాల మధ్య గంజాయి తరలిస్తూ పట్టుబడింది ఈ గంజాయి మాఫియా. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని.. వీరి నుంచి సుమారు మూడు కోట్ల విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి మండలం పెంటపాడు వద్ద రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన టాటా వాహనంలో బియ్యం బస్తాల చాటున దాచిన 1700 కిలోల గంజాయి సంగతి బయటపడింది.
ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు లారిలో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. గంజాయి దారికొండ సమీపంలోని ఒరిస్సా సరిహద్దు నుంచి సీతారాం అతని స్నేహితుడు మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారస్తులకు సరఫరా చేస్తున్నట్లు డ్రైబర్ ఫేకు యాదవ్, రవీంద్ర యాదవ్ లు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..