YS Jagan: ఢిల్లీ చేరకున్న సీఎం జగన్‌.. మోదీ, అమిత్‌షాలతో కీలక భేటీ. ఏ అంశాలు చర్చకు రానున్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి చేకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు..

YS Jagan: ఢిల్లీ చేరకున్న సీఎం జగన్‌.. మోదీ, అమిత్‌షాలతో కీలక భేటీ. ఏ అంశాలు చర్చకు రానున్నాయంటే..
Cm Jagan (file Photo)
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 17, 2023 | 6:43 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి చేకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్‌ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. అనతరం అక్కడి 1 జన్‌పథ్‌ నివాసానికి చేరుకున్నారు. ఢిల్లీ టూర్‌లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రుల‌తో సీఎం జ‌గ‌న్ భేటీ కానున్న‌ట్టు స‌మాచారం. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.

పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోదీని అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను కేంద్ర మంత్రులకు ఇస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జులైలో విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఇప్పటికే కేబినెట్ భేటీలో జగన్ మంత్రులకు స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలతో సీఎం చర్చిం చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన కాసేపటికే జగన్‌ ఢిల్లీ టూర్‌ వెళ్లడం ప్రాధానత్య సంతరించుకుంది. రాజధాని ప్రధాన అంశంగా సీఎం ఢిల్లీ టూర్‌ ఉంటుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగన్‌ ఢిల్లీ పెద్దలతో ఏ అంశాలపై చర్చించారో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే