Fraud Case: రూ.10లక్షలకే కిలోన్నర బంగారం.. మంచితరుణం ముంచేసింది..!

|

Jan 20, 2022 | 9:08 AM

Gold Fraud: అనంతపురం జిల్లాలో బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది.

Fraud Case: రూ.10లక్షలకే కిలోన్నర బంగారం.. మంచితరుణం ముంచేసింది..!
Gold Coins
Follow us on

Gold Fraud: అనంతపురం జిల్లాలో బంగారు నాణేల పేరుతో ఓ రైతును మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ దొంగల ముఠా రైతును బురిడీ కొట్టించి బంగారు నాణాలు అని నమ్మించి.. నకిలీవి అంటగట్టింది..ఏకంగా 10 లక్షల నగదు దండుకుని పారిపోయింది ముఠా..బాధితుల ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరి జిల్లాకు చెందిన విజయ్ కుమార్, అశోక్, దివాకర్ అనే ముగ్గరు వ్యక్తులు వ్యసనాలకు బానిసై .. వాటి కోసం ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా..పొలం, ఇళ్ల పునాదుల తవ్వకాలలో బంగారు నాణేలు దొరికాయని.. వీటిని తక్కువ ధరలకే విక్రయిస్తామని అమాయకులను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా బాజకుంట గ్రామానికి చెందిన పరమేష్ , మహేష్ లను ఫోన్లలో నమ్మించారు. వీడియో కాల్‌ చేసి.. ఒరిజినల్ బంగారు నాణేన్ని చూపించారు.

ఇది నిజమని భావించి కిలోన్నర నాణేలు 10లక్షల రూపాయలకే ఇస్తామంటూ నమ్మబలికారు. పథకం ప్రకారం వారిని అనంతపురం సమీపంలోని కురుగుంట వద్దకు రమ్మని చెప్పారు. తెల్లని గుడ్డ సంచి ఇచ్చి అందులో ఉన్న బంగారు నాణేలు చెక్ చేసుకోమని ముఠా సభ్యులు చెప్పారు. నాణేలు బంగారువి కాదని నిర్ధారించుకుని నిలదీశారు. అసలు విషయం తెలిసిపోయిందని భావించి.. వారి చేతిలో ఉన్న నగదు, సెల్ ఫోన్ లను ముఠా సభ్యులు లాక్కొని పారిపోయారు. దీంతో బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నాలుగురోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10లక్షల నగదు కారు, బైకు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలు తరచూ జరుగుతున్నాయని.. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి సూచించారు.

Also read:

Viral Video: స్కూటీతో స్టంట్స్ చేయాలనుకుంది.. బెడిసికొట్టి బొక్కబోర్లా పడింది.. వైరల్ వీడియో మీకోసమే!

Paracetamol Side Effects: పారాసెటమాల్ టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇవి తెలుసుకోండి!

Astro Tips: ఈ చెట్టు దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.. కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది..!