Fakewebsite: టీటీడీ ప్రసాదం పేరుతో అక్రమ వ్యాపారం.. కేటుగాళ్ల గుట్టు రట్టు..

| Edited By: Balaraju Goud

Dec 07, 2020 | 10:10 PM

ప్రజల్లో కరోనా పట్ల భయాన్ని.. అదే సమయంలో శ్రీనివాసుడిపై వారికున్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని దొరికినకాడికి దోచుకుందామని..

Fakewebsite: టీటీడీ ప్రసాదం పేరుతో అక్రమ వ్యాపారం.. కేటుగాళ్ల గుట్టు రట్టు..
Tirumala Tirupati Devasthanams
Follow us on

ప్రజల్లో కరోనా పట్ల భయాన్ని.. అదే సమయంలో శ్రీనివాసుడిపై వారికున్న విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని దొరికినకాడికి దోచుకుందామని ప్లాన్ చేశారు కొందరు కేటుగాళ్లు. కానీ అంతలోనే అడ్డంగా దొరికిపోయారు. తిరుమలలో టీటీడీ ప్రసాదం పేరుతో అక్రమ వ్యాపారం సాగిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌నే రూపొందించారు కేటుగాళ్లు. బాలాజీప్రసాదం.కామ్ పేరుతో వెబ్‌సైట్‌ను పెట్టారు దుండగులు. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్రసాదమైన రెండు లడ్డూలను రూ.500లకు విక్రయానికి పెట్టారు. అంతేకాదు.. సంవత్సరానికి రూ.5వేలు, రెండేళ్లకు రూ.9600 ధరకు చందాల పేరుతో వెబ్ సైట్‌లో స్లాట్లు దర్శనమిస్తున్నాయి. బల్క్ ఆర్డర్ పేరుతో 4 లడ్డూలను రూ.వెయ్యికి విక్రయానికి ఉంచారు. సంవత్సర చందా తీసుకున్న వారికి నెలకు రెండు లడ్డూలను కొరియర్ ద్వారా ఇళ్లకు పంపుతామని నమ్మబలుకుతున్నారు. అయితే తమకు వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తామని సదరు వెబ్ సైట్ లో పొందుపరచారు. అయితే, ఈ వ్యవహారాన్ని గుర్తించిన టీవీ9 సిబ్బంది.. టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. సదరే ఫేక్ సైట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. చట్టపరమైన చర్యలు తీసుకుని వెబ్ సైట్ నిర్వాహకులపై కేసులు పెట్టాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.