Andhra Pradesh: రాజధాని ఎక్కడో చెబితే కార్యాలయం పెడతాం.. ఆర్బీఐ లేఖ..

|

Feb 01, 2022 | 8:17 PM

Andhra Pradesh: విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడేళ్లు పైబడినా.. ఆ రాష్ట్రాన్ని ఇప్పటికీ రాజధాని సమస్య వెంటాడుతోంది.

Andhra Pradesh: రాజధాని ఎక్కడో చెబితే కార్యాలయం పెడతాం.. ఆర్బీఐ లేఖ..
Follow us on

Andhra Pradesh: విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడేళ్లు పైబడినా.. ఆ రాష్ట్రాన్ని ఇప్పటికీ రాజధాని సమస్య వెంటాడుతోంది. రాజధాని ఏదో తెలియక రాష్ట్ర ప్రజలే కాదు.. ప్రభుత్వ వ్యవస్థలు కూడా కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిన లేఖ.. రాజధాని సమస్యను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాక తమ కార్యాలయం ఏర్పాటు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి వీరాంజనేయులు ఆర్బీఐకి ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ సుభాశ్రీ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో ఫైనలైజ్ చేస్తే అక్కడ ఆర్‌బిఐ సంస్థను నెలకొల్పుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 104 కరెన్సీ చెస్ట్‌లు (CC) పనిచేస్తున్నాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో కరెన్సీ నోట్ల కొరత గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అధికార యంత్రాంగం, పోలీసు వ్యవస్థతో సమన్వయంతో ఏపీలో సమర్థవంతంగా కరెన్సీ నిర్వహణ చేస్తున్నాం.’’ అని సుభాశ్రీ పేర్కొ్న్నారు.

Also read:

Handball Academy: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ..

Viral Photos: ఫిబ్రవరిలో ప్రేమికులు సందర్శించడానికి ఈ ప్రదేశాలు సూపర్.. అవేంటంటే..?

Guntur Jinnah Tower: గుంటూరులోని జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు.. 3వ తేదీన..