AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool Bus Accident Live: కర్నూల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు దగ్దం.. పలువురు ప్రయాణికులు సజీవ దహనం!

Kurnool Bus Accident Live Updates: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు అగ్నిప్రమాదానికి గురైంది. బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతిచెందడంతో పాటు చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసి క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

Kurnool Bus Accident Live: కర్నూల్లో ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు దగ్దం.. పలువురు ప్రయాణికులు సజీవ దహనం!
Kurnool Bus Accident
Anand T
|

Updated on: Oct 24, 2025 | 2:25 PM

Share

ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ ద్వారా బయటపడ్డారు. పలువురు ప్రయాణీకులు సజీవదహనం అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.

ఇదిలా ఉండగా.. బెంగళూరు వెళ్తున్న బస్సు టూవీలర్‌ను ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం జరిగిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారు. కొంత మంది బయటపడ్డా, మరికొంత మంది రాలేకపోయారు. మంటలతో లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు ఎస్పీ. ఈ ఘటన గురించి తెలియగానే FSL టీమ్‌ స్పాట్‌కు చేరింది. బస్సు ఎక్స్‌‌ట్రా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం. డ్రైవర్‌ను కూడా పంపించాలని ట్రావెల్స్ యాజమాన్యానికి చెప్పామన్నారు ఎస్పీ. ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని పేర్కొన్నారు.

ప్రమాదానికి సంబంధించిన లైవ్‌ను ఇక్కడ చూడండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Oct 2025 01:39 PM (IST)

    కర్నూలు బస్సులో ప్రమాదంలో ఆరుగురు తెలంగాణ వాసులు మృతి

    కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది మృతి

    మృతుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు ప్రయాణికులు

    ప్రమాద సమయంలో బస్సులో 13 మంది తెలంగాణ వాసులు

    గాయాలతో బయటపడిన మరో ఏడుగురు తెలంగాణ ప్రయాణికులు

  • 24 Oct 2025 12:35 PM (IST)

    బస్సు ప్రమాద బాధితులకు.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స

    ఘటన తర్వాత ఆస్పత్రికి వచ్చిన 11 మంది బాధితుల్లో.. ప్రస్తుతం నలుగురికి వైద్యం అందిస్తున్నారు.

    స్వల్ప గాయాలతో బయటపడ్డ వారు ప్రాథమిక చికిత్స అనంతరం స్వస్థలాలకు బయలుదేరారు

    బస్సులో నుంచి దూకడంతో ప్రయాణికుల కాళ్లు, తలకు గాయాలయ్యాయి

  • 24 Oct 2025 12:32 PM (IST)

    కర్నూలు మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం

    మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

    క్షతగాత్రులకు రూ.2 లక్షల పరిహారం -తెలంగాణ ప్రభుత్వం

    తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రకటించిన మంత్రి పొన్నం

  • 24 Oct 2025 12:29 PM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదంలో.. యాదాద్రి జిల్లా యువతి మృతి

    గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి

    బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అనూషరెడ్డి

    దీపావళికి స్వగ్రామం వచ్చి రాత్రి బెంగళూరుకు బయలుదేరి, ప్రమాదంలో మృతిచెందిన అనూషరెడ్డి

  • 24 Oct 2025 10:48 AM (IST)

    బస్సు ప్రమాదం.. కర్నూలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

    కర్నూలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08518-277305

    కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కంట్రోల్ రూమ్: 9121101059

    ప్రమాద స్థల నియంత్రణ గది: 9121101061

    కర్నూలు పోలీస్ ఆఫీస్ కంట్రోల్ రూమ్: 9121101075

    కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010

    బాధిత కుటుంబాలు సమాచారం, సహాయం కోసం పైన పేర్కొన్న నంబర్లను సంప్రదించవచ్చు.

  • 24 Oct 2025 10:44 AM (IST)

    ఆ విండో లేకపోతే నేను బస్సులో కాలిపోయేవాలిని.. ప్రయాణికుడు

    కర్నూలు బస్సు అగ్నిప్రమాద భయానక పరిస్థితులను వివరించిన ప్రయాణికుడు

    ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 27 ఏళ్ల జయంత్ కుష్వాహా

    ఎమర్జెన్సీ విండో లేకపోతే నేనూ ఆ బస్సులో కాలిపోయే వాడిని: జయంత్

    కర్నూలు 10 కిలోమీటర్లు ముందే ఈ ప్రమాదం జరిగింది: జయంత్

  • 24 Oct 2025 10:37 AM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదం.. 20కి చేరిన మృతుల సంఖ్య

    కర్నూలు బస్సు ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య

    బస్సులో నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్న సిబ్బంది

    ఇప్పటి వరకు 19 మృతదేహాలను బయటకు తీసిన సహాయక సిబ్బంది

    ప్రమాదం నుంచి బయటపడిన 23 మంది ప్రయాణికులు

    ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు

    హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పలువురు

    హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయిన ఏడుగురు ప్రయాణికులు

    ప్రమాదస్థలికి చేరుకున్న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి

    స్పాట్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

    DNA పరీక్ష ద్వారా డెడ్‌బాడీలను బంధువులకు అప్పగించే ఏర్పాట్లు

  • 24 Oct 2025 09:46 AM (IST)

    బస్సు ప్రమాద ఘటన పై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిరంతర పర్యవేక్షణ

    ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష

    ఘటన స్థలానికి బయలుదేరిన జెన్కో సీఎండీ హరీశ్

    ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సాయం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు

    మి. శ్రీరామచంద్ర, అసిస్టెంట్‌ సెక్రటరీ – 9912919545

    ఈ. చిన్ని బాబు, సెక్షన్‌ ఆఫీసర్‌ – 9440854433

    హెల్ప్‌లైన్‌ కార్యకలాపాలను పర్యవేక్షించనున్న ప్రోటోకాల్‌ డైరెక్టర్

  • 24 Oct 2025 09:37 AM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్-గ్రేషియా ప్రకటన

    కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి

    ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం: మోదీ

    మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

    గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: మోదీ

    మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఎక్స్-గ్రేషియా ప్రకటించిన ప్రధాని

  • 24 Oct 2025 09:34 AM (IST)

    కర్నూల్ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి

    కర్నూల్ బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి

    మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం.

    ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు.

    ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోయారన్న వార్తలు దిగ్బ్రాంతికి గురి చేశాయన్నారు.

    మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

    ప్రమాదంలో గాయపడిన వారంతా క్షేమంగా ఉండాలని, సంపూర్ణంగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

  • 24 Oct 2025 09:32 AM (IST)

    కర్నూలు బస్సు అగ్నిప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం

    కర్నూలు బస్ ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకర ఘటన

    గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి

  • 24 Oct 2025 08:16 AM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

    కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత

    బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన హోం మంత్రి

    క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశం.

    ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న హోంమంత్రి అనిత

    ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకుంటున్న మంత్రి

    మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి

    మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్న హోంమంత్రి

  • 24 Oct 2025 08:14 AM (IST)

    మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్ట్‌లు చేస్తున్నాం- మంత్రి సత్యకుమార్

    కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి సత్యకుమారు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాల సేకరణ జరుగుతున్నట్టు తెలిపారు. బస్సులోనే భౌతిక కాయాలు ఉన్నాయిని.. పరిస్థితులకు అనుగుణంగా ఘటన స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫోరెన్సిక్ వైద్యులను ఘటన స్థలానికి పంపించామని.. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్తానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో 12 మంది బయటపడ్డారని వారిని ఆసుపత్రిలో చేర్పించినట్టు మంత్రి తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారని ఆయన వివరించారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని మంత్రి మంత్రి సత్యకుమార్ తెలిపారు.

  • 24 Oct 2025 08:09 AM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రిగ్బాంతి

    హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని విషయం తనను తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాద ఘటన పై కర్నూల్ జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.

  • 24 Oct 2025 08:06 AM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

    కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తో మాట్లాడారు. ప్రమాదంపై తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని గద్వాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

  • 24 Oct 2025 08:02 AM (IST)

    ఘటనా స్థలానికి ఏపీ రవాణశాఖ మంత్రి

    కర్నూలు జిల్లా లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనాస్థలానికి బయలుదేరిన రవాణశాఖా మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి

    పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మనసును కలచివేసిందని అవేదన

  • 24 Oct 2025 07:56 AM (IST)

    కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సీఎస్‌, అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.

Published On - Oct 24,2025 7:52 AM