AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో వాలంటీర్ల సంచలన నిర్ణయం.. మూకుమ్మడి రాజీనామాలు

ఏపీలో వాలంటీర్ల రాజీనామా కంటిన్యూ అవుతోంది. ప్రతిపక్ష కూటమి తమపై కక్ష కట్టడంతోనే... రిజైన్‌ చేస్తున్నామంటున్నారు వాలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వందల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడం రాజకీయంగానూ రచ్చ లేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు... తప్పు మీదంటే, మీదంటూ మాటలు యుద్ధానికి దిగుతున్నాయి. అసలు వాలంటీర్ల విషయంలో తప్పెవరిది...?

AP News: ఏపీలో వాలంటీర్ల సంచలన నిర్ణయం.. మూకుమ్మడి రాజీనామాలు
Ap Volunteers
Ram Naramaneni
|

Updated on: Apr 01, 2024 | 7:47 PM

Share

ఏపీలో ఈసీ ఆదేశాలు… వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలకు దారితీశాయి. ఎలక్షన్‌ విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో… రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున రాజీనామా చేస్తున్నారు వాలంటీర్లు. విపక్ష నేతల వైఖరితో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నంలో 823 మంది వాలంటీర్లుండగా… ఒక్కసారే 430 మంది రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటు కర్నూలులోనూ 92 మంది వాలంటీర్లు తమ రాజీనామాను సమర్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వందల మందికిపైగా వాలంటీర్లు రాజీనామా చేయడం పొలిటికల్‌ ఫైట్‌కు కారణమైంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వాలంటీర్ల విషయంలో తప్పు మీదంటే… మీదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు.

వాలంటీర్‌ వ్యవస్థను చంద్రబాబే అడ్డుకున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వాలంటీర్లను ఆపి బడుగు-బలహీన వర్గాలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై పేర్ని నాని సైతం ఫైరయ్యారు. కొంతమంది వ్యక్తులతో కలిసి చంద్రబాబే వాలంటీర్‌ వ్యవస్థను ఆపేశారని విమర్శలు గుప్పించారు. ఇక వైసీపీ నేతల మాటలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వాలంటీర్లను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు. వాలంటీర్ల విషయంలో టీడీపీని తప్పున పడేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.

మొత్తంగా… వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్‌ ఫైట్‌ కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా వాలంటీర్ల వరుస రాజీనామాలతో మరింత వేడెక్కింది ఏపీ రాజకీయం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
జీరో బ్యాలెన్స్.. ఉచిత సేవలు.. ఐపీపీబీ సరికొత్త విప్లవం
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
మే 2న అందరి ఫోన్‌లలో సైరన్‌ శబ్దం.. ఎందుకు? కంగారు పడకండి.. అసలు
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
కల్తీ మామిడి పండ్ల మాఫియాకు చెక్ పెట్టే యాప్ ఉందని తెలుసా
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..