Liquor Sales: రండి రారండి.! మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తాగినోళ్లకు తాగినంత మందు

|

Dec 31, 2024 | 8:15 AM

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు మందుబాబులు రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్‌ అమ్మకాలు ఏరులై పారుతున్నాయి. బీర్ల అమ్మకాలు సెలయేరులా ప్రవహిస్తున్నాయి. త్రీ ఛీర్స్‌తో 2025కి వెల్‌కమ్‌ చెప్పనున్నారు మద్యం ప్రియులు. ఒక్కరోజే వెయ్యి కోట్ల అమ్మకాలతో లిక్కర్‌ సేల్స్‌ కిక్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు చేరనుందా?

Liquor Sales: రండి రారండి.! మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. తాగినోళ్లకు తాగినంత మందు
Liquor
Follow us on

న్యూ ఇయర్‌‌లోకి అడుగు పెట్టేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే సంబరాలు అంబరాన్ని తాకాల్సిందే. తెలంగాణలో ఈసారి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనాలు వేస్తున్నారు. డిసెంబర్ 31న ఒక్కరోజే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్‌ అమ్మకాలు జరిగే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక గత మూడు రోజుల్లో దాదాపు రూ. 565 కోట్ల విలువైన మద్యం లిస్ట్‌ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

2024 ముగుస్తోంది. 2025 రాబోతోంది. దీంతో సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ అయిపోతున్నారు. ఆరోజు ఎలా ఎంజాయ్ చేయాలి అనే దానిపై పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆరోజు చుక్క, ముక్క లేకుండా వేడుకలు జరగవు. మరీ ముఖ్యంగా మందుప్రియులు డిసెంబర్ 31న పీకల దాకా తాగి గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాది కలిసి రావాలని కోరుకుంటూ వేడుకలు చేసుకుంటారు. దీంతో తెలంగాణలో ఇవాళ మద్యం ఏరులై పారనుంది. డిసెంబర్ 31న కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 620 మద్యం దుకాణాలు ఉండగా.. 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది.

న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండొచ్చని పేర్కొంది. ఇక బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.

ఇక ఏపీలోనూ కొత్త ఏడాది జోష్ కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ హడావుడితో పాటు వైన్ షాప్స్ దగ్గర మద్యం ప్రియుల సందడి కూడా మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవటమే కాకుండా రూ. 99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తేవడంతో మద్యం ప్రియులు రెట్టించిన ఉత్సాహంతో మద్యం కొంటున్నారు. రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాల్లో రూ.99కే బ్రాండ్ కే డిమాండ్ పెరిగిందని… మొత్తం అమ్మకాల్లో సుమారు 25 శాతం మేర ఈ బ్రాండ్ మద్యం అమ్మకాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో 99 రూపాయల మద్యానికి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ఇతర కంపెనీలు కూడా ఈ రకం మద్యం తయారీకి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. తక్కువ ధర బ్రాండ్ల మద్యం అమ్మకాలు పెరగటంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతున్నట్లు ఎక్సైజ్ తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు మందులో మునిగి తేలేందుకు రెడీ అయ్యారు. ఎక్కడ చూసినా ఛీర్స్‌ అండ్‌ బీర్స్‌ అంటూ చిల్‌ అవుతున్నారు మందుబాబులు. ప్రధాన నగరాల్లో న్యూ ఇయర్‌ జోష్‌ ఇప్పటికే కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి