బ్రేకింగ్: ముళ్ల పొదల్లో మద్యం డంప్

|

May 26, 2020 | 5:33 PM

రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో భారీ మద్యం డంప్ కనిపించడంతో ఏపీ పోలీసులు అవాక్కయ్యారు. మంగళవారం మధ్యాహ్నం భారీ మద్యం డంప్‌ను ఏపీ పోలీసులు కనుగొన్నారు. దాన్ని తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తున్న ...

బ్రేకింగ్: ముళ్ల పొదల్లో మద్యం డంప్
Follow us on

రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో భారీ మద్యం డంప్ కనిపించడంతో ఏపీ పోలీసులు అవాక్కయ్యారు. మంగళవారం మధ్యాహ్నం భారీ మద్యం డంప్‌ను ఏపీ పోలీసులు కనుగొన్నారు. దాన్ని తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీకి తరలిస్తున్న మద్యంగా పోలీసులు గుర్తించారు. ఏపీలో లభ్యమవుతున్న మద్యం అడ్రస్ లేని బ్రాండ్లని ఆంధ్ర మందుబాబులు చెప్పుకుంటుంన్న నేపథ్యంలో ఈ మద్యం డంప్ లభ్యమవడం విశేషం.

లాక్ డౌన్ ఒకవైపు.. ఏపీలో మద్యం ధరలను భారీగా పెంచడంతోపాటు అడ్రస్ లేని బ్రాండ్లను విక్రయానికి రెడీ చేయడంతో తెలంగాణ నుంచి మద్యాన్ని అక్రమంగా తరలించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్లపొదల్లో తెలంగాణ నుండి మద్యం అక్రమంగా తీసుకువచ్చి నిల్వవుంచిన 1600 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు దాచేపల్లి పోలీసులు. వీటి విలువ ఐదు లక్షల రూపాయలుంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో సరైన బ్రాండ్లు దొరక్కపోవడంతో వారు తెలంగాణ మద్యం వైపు చూస్తున్నారని, అందుకే కొందరు బరితెగించి తెలంగాణ మద్యాన్ని ఏపీకి స్మగుల్ చేస్తున్నారని చెబుతున్నారు.