విజయవాడలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. డయల్ ఇనిస్టిట్యూట్ పేరిట మోసం వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేశారు. నిరుద్యోగులే టార్గెట్ గా మోసానికి తెరలేపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ బందరు రోడ్డులో డయల్ ఇనిస్టిట్యూషన్ పేరుతో ఒక ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. విజయదుర్గా, వైశాలి, ఇషా, సిద్ధార్ధ దండేబోయిన కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్ లైన్ లో లోకల్ యాప్ ద్వారా ప్రకటనలిచ్చారు. అది చూసిన నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు పెట్టారు.. యాప్ లో చూసిన వారు వెంటనే కాల్ చేస్తే బిఎస్ఎన్ఎల్, కార్గో, అమెజాన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పేర్లు చెప్పారు.. వాళ్ళతో మాకు కాంట్రాక్టు ఉందంటూ నమ్మించారు.
ఒకసారి వస్తే మాట్లాడదాం అంటూ బాధితులను మభ్యపెట్టారు. వారు వచ్చి మాట్లాడిన అనంతరం.. డబ్బులు ఖర్చవుతాయని నమ్మించారు. ఇలా వేలల్లో మొదలెట్టి రూ. లక్షల్లో వసూలు చేసారు. వచ్చిన ప్రతీ ఒక్కరినీ అప్లికేషన్ తో పాటు మనీ కట్టాలని అడిగారు. అడిగిన సొమ్ము మొత్తం అప్లికేషన్ ఫీజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట వసూళ్ళు చేసారు. అనంతరం ఫోన్ ఆఫ్ చేసుకొని పరారయ్యారు. ఇక మళ్లీ డబ్బులు అవసరం వచ్చినపుడు అ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అంటూ నమ్మించారు.
ఇందులో మొత్తం 40 మందికి పైగా నిరుద్యోగులను నమ్మించి మోసం చేసారు. ఇక 40 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైన నిరుద్యోగులు ఇలాంటి జాబులు ఇప్పిస్తామంటే నమ్మి మోసపోవద్దు అని చెబుతున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..