Anna Canteens: ఆధార్, రేషన్ కార్డులు అవసరం లేదు.. రూ.5తోనే జనం ఆకలి తీర్చే అద్భుత పథకం..!

|

Aug 16, 2024 | 3:12 PM

ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్‌ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు..

Anna Canteens: ఆధార్, రేషన్ కార్డులు అవసరం లేదు.. రూ.5తోనే జనం ఆకలి తీర్చే అద్భుత పథకం..!
Anna Canteen Menu
Follow us on

అమ్మ.. అన్న..పేరు ఏదైతేనేం.. పేదోళ్ల కడుపులు నింపడానికి… ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా… తాము పెట్టుకున్న గడువుకున్నా ముందే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పేరుతో తీసుకొచ్చిన పథకం అన్న క్యాంటీన్లు. ఇక్కడ భోజనం చేయడానికి అర్హత అక్కర్లేదు. రేషన్ కార్డు చూపించక్కర్లేదు. కడుపులో ఆకలి, చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు.. అన్న క్యాంటీన్లోకి అడుగుపెట్టొచ్చు. ఓ పెద్ద హోటల్‌ అందించేంత మెనూతో, అత్యంత శుభ్రతతో భోజనం వడ్డిస్తారు. నిజానికి గతంలోనే కూలీలు, కార్మికులు, డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపించేవారు.. ఇలా ఎంతో మంది పేదల ఆకలి తీర్చింది అన్న క్యాంటిన్. జస్ట్‌ 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారం దొరుకుతూ ఉండటంతో పెద్ద సంఖ్యలో పేదలు వీటిని ఉపయోగించుకున్నారు.  ఆ తర్వాత ఐదేళ్లు వీటికి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. ఉద్దేశం ఏదైనా.. రాజకీయంగా ఎవరెన్ని కామెంట్లు చేసినా.. పట్టణాల్లోని పేద, దిగువ మధ్యతరగతి వారి ఆకలిబాధ తీర్చాయి అన్న క్యాంటీన్లు. అందులో ఎలాంటి సందేహాలు లేవు. అక్షయపాత్ర సహకారం అన్న క్యాంటీన్లలో కేవలం ప్రభుత్వ పాత్ర మాత్రమే లేదు. ఒకరకంగా అన్న క్యాంటీన్ బిల్డింగ్ కట్టించి, భోజనాలు తీసుకొచ్చే హాట్ బాక్స్‌లను మాత్రమే ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. ఆహారం రుచికరంగా వండి సమయానికి తగ్గట్టుగా ట్రాన్స్‌పోర్ట్‌తో సహా తీసుకొచ్చేది మాత్రం హరే కృష్ణ మూమెంట్‌కు చెందిన అక్షయ పాత్ర...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి