చిక్కుల్లో ఏపీ హోం మినిస్టర్!

| Edited By:

Nov 26, 2019 | 11:28 PM

తాడికొండ  (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే,  హోంమంత్రి మేకతోటి సుచరిత, అదే షెడ్యూల్డ్ కులధృవీకరణ పై వివాదాల్లో చిక్కుకుంది. ప్రత్తిపాడు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సుచరిత అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాదృచ్చికంగా, గుంటూరులో మంగళవారం ఆమె కుల కేసు విచారణ కోసం శ్రీదేవి హాజరైన రోజు హోంమంత్రిపై ఈ కేసు నమోదైంది. ఫోరమ్ ఫర్ ఇండిజీనస్ రైట్స్ – ఎస్సీ కుల ధృవీకరణను దుర్వినియోగం చేసినందుకు అస్సాం కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్ […]

చిక్కుల్లో ఏపీ హోం మినిస్టర్!
Follow us on

తాడికొండ  (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయస్ఆర్సిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే,  హోంమంత్రి మేకతోటి సుచరిత, అదే షెడ్యూల్డ్ కులధృవీకరణ పై వివాదాల్లో చిక్కుకుంది. ప్రత్తిపాడు (ఎస్సీ) నియోజకవర్గం నుంచి సుచరిత అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యాదృచ్చికంగా, గుంటూరులో మంగళవారం ఆమె కుల కేసు విచారణ కోసం శ్రీదేవి హాజరైన రోజు హోంమంత్రిపై ఈ కేసు నమోదైంది. ఫోరమ్ ఫర్ ఇండిజీనస్ రైట్స్ – ఎస్సీ కుల ధృవీకరణను దుర్వినియోగం చేసినందుకు అస్సాం కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్ ఇండియా సుచరితపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఎస్సీ రిజర్వేషన్లను దుర్వినియోగం చేసినందుకు సుచరితపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మేము ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాము. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె 2019 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అఫిడవిట్లో ఎస్సీగా. కానీ ఇటీవల ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె క్రైస్తవ మతాన్ని అచరిస్తున్నట్లు పేర్కొంది.” అని ఫోరమ్ సభ్యులు వివరించారు.