Andhra Pradesh High Court: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ.. ధర్మాసనం స్పందనపై తీవ్ర ఉత్కంఠ..

| Edited By: Pardhasaradhi Peri

Jan 18, 2021 | 10:47 AM

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. స్థానిక సంస్థల

Andhra Pradesh High Court: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో నేడు విచారణ.. ధర్మాసనం స్పందనపై తీవ్ర ఉత్కంఠ..
Follow us on

Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టు విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ సస్పెన్షన్‌ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఆ మేరకు డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. పంచాయతీ ఎన్నికలను సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును కోరింది.

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు గైడ్‌ లైన్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఎన్నికల ప్రక్రియ.. వ్యాక్సినేషన్‌కు ఏమాత్రం అడ్డు కాబోదన్నారు. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే.. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఉద్ఘాటించారు. మరి హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

 

Also read:

Corona Virus: ఆ మాస్క్‌లతో ఏకంగా ఓ ఫుట్‌బాల్ స్టేడియంనే నింపొచ్చట.. నివ్వెరపోయే అంశాలు చెప్పిన నిపుణులు..!

ఏపీ: మూడో రోజు వ్యాక్సినేషన్‌కు రంగం సిద్దం.. రెండు రోజుల్లో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నారంటే.!