టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లు కొట్టిసింది. అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్‌నెట్, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసులో అరెస్టై 30 రోజులుగా జైల్లోనే ఉన్నారు చంద్రబాబు. మిగతా 3 కేసుల్లో కూడా డీమ్డ్ కస్టడీగా చూడాలనే వాదన తోసిపుచ్చింది కోర్టు. ఫైబర్ నెట్ కేసులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో A-24గా ఉన్నారు చంద్రబాబు. ఇన్నర్ రింగు రోడ్డు కేసులో A-1గా ఉన్నారు చంద్రబాబు. అంగళ్లు కేసులో A1గా కూడా ఉన్నారు చంద్రబాబు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకి వెళ్లేందుకు చంద్రబాబుకు అవకాశం ఉంది.
అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయాడని సీఐడీ పేర్కొన్నది. శుక్రవారంలోగా రాష్ర్టానికి తిరిగి రావాలంటూ ప్రభుత్వం ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా పెండ్యాలకు నోటీసులు జారీ చేసింది.
ఇదిలావుంటే, ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణకు రానుంది. విచారణ జరపనున్న జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం వెల్లడించింది. అక్టోబర్ 3న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్ట్ ముందు దాఖలు చేసిన పత్రాలను సమర్పించాలని ఆదేశించింది సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ అడిగిన పత్రాలను సమర్పించింది ఏపీ ప్రభుత్వం.
చంద్రబాబు తరపున సాల్వే, సంఘ్వి, లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున రోహత్గీ, రంజిత్ కుమార్ వాదిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చుట్టూ జరిగిన వాదోపవాదాలు కొనసాగాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి