Eluru: పైప్ లైన్ కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్

|

Dec 03, 2022 | 9:20 AM

ఆయిల్ ఫామ్ తోటలో పైప్‌లైన కోసం గుంత తవ్వే పనిలో నిమగ్నమయ్యారు కూలీలు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ కుండ బయటపడింది.

Eluru: పైప్ లైన్ కోసం తవ్వుతుండగా బయటపడిన మట్టి కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు జిగేల్
Hidden Treasure (Representative Image)
Follow us on

అది ఆయిల్ ఫామ్ తోట. పైప్‌లైన్ కోసం కూలీలతో తవ్వకాలు జరుపిస్తున్నారు రైతు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కొందరు మట్టి తవ్వుతుండగా.. మరికొందరు ఆ మట్టిని చెలగపారతో తీసి వేస్తున్నారు. ఈ క్రమంలోనే తవ్వకాల్లో ఓ మట్టికుండ బయటపడింది. దీంతో అందులో ఏముందా అని అందరూ ఆతృతతో చూశారు. కుండ మూతను ఓపెన్ చేయగా జిగేల్‌మని మెరుస్తూ నాణేలు కనిపించాయి. తేరా పారా చూడగా అవి గోల్డ్ కాయిన్స్ అని అర్థమయ్యింది. ఈ ఘటన  ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది.

జిల్లాలోని  కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలో ఈ బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఆయిల్ ఫామ్ తోటలో పైప్‌లైన్ కోసం తవ్వుతుండగా ఓ మట్టి కుండ దొరికింది. అందులో 18 బంగారు నాణేలు లభ్యమయ్యాయి. ఈ విషయం తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చాడు ఆయిల్ ఫామ్ రైతు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఒక్కొక్క నాణెం సుమారు 8 గ్రాములుపైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

ఆ నిధి ఎవరికి చెందుతుంది:

చట్టం ప్రకారం.. నిధి సమాచారం తెలియగానే.. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించి.. ఆ ట్రజర్‌ను కలెక్టర్‌కు అప్పగిస్తారు. ఆ నిధి వారసత్వ సంపదా లేక పూర్వీకులు దాచి ఉంచినదా? అన్నది కలెక్టర్ నిర్ధారిస్తారు. ఒకవేళ ఆ నిధి పూర్వికులది అయితే.. అది ఎవరికి చెందుతుందే నిర్ధారించి.. వాటాలుగా పంచుతారు. ఒకవేల దొరికిన నిది జాతీయ సంపద అయితే,  దొరికిన దాంట్లో 1/5 వంతు ఆ ల్యాండ్ ఓనర్‌కి ఇస్తారు. ఆ భూమిని హక్కుదారుడు కాకుండా వేరొకరు సాగుచేస్తుంటే.. కౌలుదారులు, నిధిని వెలికితీసిన కూలీలకు 1/5 వంతులోనే కొంత మొత్తం ఇస్తారు. నిధిని కాజేయాలని చూస్తే శిక్షార్హులు అవుతారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..