Hero Suman: ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం జగన్ ఆదర్శం.. హీరో సుమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

యంగ్, డైనమిక్ సిఎం జగన్ పేద ప్రజల కోసం మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రముఖ హీరో సుమన్ అన్నారు.

Hero Suman: ఇతర రాష్ట్రాలకు కూడా సీఎం జగన్ ఆదర్శం.. హీరో సుమన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Suman

Updated on: Dec 20, 2021 | 6:37 PM

CM Jagan Birthday: యంగ్, డైనమిక్ సిఎం జగన్ పేద ప్రజల కోసం మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. సిఎం జగన్ తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న సుమన్ ఒక్కసారిగా వైఎస్ కుటుంబంపై ప్రశంసలు గుప్పించాడాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. గతంలో టిడిపి నుండి సుమన్ ఎన్నికల బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. మొదటి నుండి టిడిపి నేతలతో సుమన్ కి పరిచయాలున్నాయి. గుంటూరు జిల్లా టిడిపి నేత ఈడే మురళి కృష్ణతో అవినాభావ సంబంధం ఉంది. అయితే ఈరోజు ఏకంగా సిఎం జగన్ ముందస్తు జన్మదిన వేడుకల్లో హోంమంత్రి సుచరితతో కలిసి సుమన్ పాల్గొనటం వైఎస్ కుటుంబాన్ని కీర్తించడంతో ఆయన వైసిపిలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.

అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా చేస్తే ఏ స్థానం నుండి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు చాలా కాలం ఉండటంతో ముందు పార్టిలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. సిఎం ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనటానికి ముందు గుంటూరులోని హోంమంత్రి సుచరిత ఇంటికి వెళ్ళి ఆమెను కలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. గుంటూరు జిల్లాలోని ఏదో ఒక నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఆయన అభిమాని పట్టీల శ్రీను ఏర్పాటు చేసిన సిఎం జగన్ ముందస్తు జన్మదిన వేడుకల్లో హోంమంత్రి సుచరిత, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతో కలిసి పాల్గొని వైసిపికి అనుకూలంగా మాట్లాడారని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అయితే మున్ముందు ఏం జరుగుతోందని అటు సుమన్ అభిమానులు ఇటు వైసిపి కార్యకర్తలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

(రిపోర్టర్: టి నాగరాజు, TV 9, గుంటూరు.)

మరిన్ని ఇక్కడ చదవండి : 

Four Day Week: వారానికి నాలుగు రోజుల పని విధానంపై కేంద్రం కసరత్తులు.. త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం!

Proddatur MLA: ఆయన మంత్రి కాదు.. శాసనసభ సభ్యుల్లో ఆయనొకరు.. వీరాభిమానం చాటుకున్న పోలీసులు!

IPL 2022 Mega Auction: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వాయిదా పడనున్న మెగావేలం.. ఎందుకంటే?