AP Rains: ఏపీని బెంబేలెత్తిస్తోన్న వర్షాలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు.!

|

Sep 08, 2024 | 6:44 PM

ఏపీకి మరో బిగ్‌ అలర్ట్‌. బంగాళాఖాతంలో వాయుగుండం... తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందంటోంది వాతావరణశాఖ. ఆ వాయుగుండం రేపు సాయంత్రం తీరం.. ఆ వివరాలు ఇలా..

AP Rains: ఏపీని బెంబేలెత్తిస్తోన్న వర్షాలు.. ఈ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు.!
Schools Holiday
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా మూడు జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు సోమవారం సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటు ఇప్పటికే విజయనగరం జిల్లాలోని స్కూల్స్‌కు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగితే.. సెలవులు పొడిగించే అవకాశం ఉందని సమాచారం.

ఇది చదవండి: S అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదో తెల్సా? రొమాన్స్‌లో రెచ్చిపోతారట

మరోవైపు విశాఖ జిల్లా గోపాలపట్నంలో వర్షాలకు కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. వరద చుట్టుముట్టడంతో కూలిపోయే స్థితిలో పలు భవనాలు కనిపిస్తున్నాయి. దీంతో పలు ఇళ్లలోని కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇక ఏపీలో ఇప్పటిదాకా విజయనగరంలో అత్యధికంగా 10.7 సెంటీమీటర్ల వర్షపాతం.. ఎన్టీఆర్‌ జిల్లాలో 10.1 సె.మీ.. విశాఖపట్నంలో 8 సె.మీ.. ఏలూరు జిల్లాలో 8 సె.మీ.. అల్లూరి జిల్లాలో 5 సె.మీ.. ప్రకాశం జిల్లాలో 6 సె.మీ.. గుంటూరులో 4 సె.మీల వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..