AP Rains: మాడుపగిలే ఎండలకు బ్రేక్.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరిక

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపునీటితో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గుడివాడ, కంకిపాడు, నూజివీడులో భారీ వర్షం కురిసింది. ఆ వివరాలు

AP Rains: మాడుపగిలే ఎండలకు బ్రేక్.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరిక
Ap Rains

Updated on: May 05, 2025 | 11:41 AM

ఏపీకి కూడా భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిన్న రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 7 గంటల నాటికి కాకినాడ జిల్లా కాజులూరులో 100. 5మిమీ, చొల్లంగిపేటలో 94.5మిమీ, కరపలో 75.5మిమీ, కాకినాడలో 66.7మిమీ, కోనసీమ జిల్లా అమలాపురంలో 65.5మిమీ, ఏలూరు నిడమర్రులో 65.2మిమీ, తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 65మిమీ,ఏలూరు ధర్మాజీగూడెంలో 64.5మిమీ వర్షపాతం చొప్పున భారీ వర్షాలు నమోదైంది. పలు జిల్లాల్లో 130చోట్ల 20మిమీ కంటే ఎక్కువ పిడుగులతో కూడిన మోస్తారు వర్షపాతం కురిసింది. మరో రెండు రోజుల వరకు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశముందని తెలిపింది.

సోమ,మంగవారాల్లో (5, 6తేదీల్లో) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట.

బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు. రానున్న రెండు రోజులు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 41°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం నంద్యాల జిల్లా గోనవరంలో 42.7°C, నెల్లూరు జిల్లా సోమశిలలో 42.5°C, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 42.1°C, వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 41.8°C, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 41.6°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..