Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల గుడికి, పునుగు పిల్లికి ఉన్న లింక్ ఏంటి.? చరిత్ర తెలిస్తే స్టన్ అవ్వడం పక్కా

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. అలంకార ప్రియుడే కాదు అభిషేకం ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగమే ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌కు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం.

Tirumala: తిరుమల గుడికి, పునుగు పిల్లికి ఉన్న లింక్ ఏంటి.? చరిత్ర తెలిస్తే స్టన్ అవ్వడం పక్కా
Ap News
Follow us
Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: May 05, 2025 | 11:39 AM

పునుగు పిల్లి.. అటవీ చట్టాల్లో షెడ్యూల్ వన్ యానిమల్. అంతరించిపోతున్న ఈ  జాతి జంతువులకు తిరుమల శ్రీవారితో ఉన్న అనుబంధంతో టీటీడీ పునుగు పిల్లి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఈ మేరకు దాదాపు రూ. 7 కోట్ల మేర ఖర్చు పెడుతోంది. తిరుపతి జూ పార్క్‌లో పునుగు పిల్లి ఆవాసం కోసం ప్రత్యేక ఎన్ క్లోజర్‌ను నిర్మిస్తోంది.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. అలంకార ప్రియుడే కాదు అభిషేకం ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగమే ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్‌కు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం. శ్రీవారి అభిషేకంలో పునుగు తైలమే కీలకం. ప్రతిరోజు శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాల అర్చన అనంతరం పునుగు పిల్లి తైలంతో సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్‌కు లేహంతో అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి సాలిగ్రామ విగ్రహం తేజస్సుకు ఒక కారణంగా కూడా భక్తులు భావిస్తారు. అసలు పునుగు పిల్లికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి అన్న విషయం పక్కన పెడితే పునుగు పిల్లి సంరక్షణ కోసం టీటీడీ ఎంతో ప్రాధాన్యత నిస్తోంది.

గత 30 ఏళ్ల క్రితం వరకు టిటిడి గోశాలలో పునుగుపిల్లిని ఉంచి తిరుమల శ్రీవారి అభిషేకం కోసం తైలం సేకరిస్తూ వచ్చింది. టిటిడి అటవీ శాఖ అభ్యంతరంతో పునుగు పిల్లలను ఎస్‌వి జూపార్క్‌కు తరలించింది. షెడ్యూల్ వన్ యానిమల్‌గా పరిగణించే పునుగు పిల్లిని నిబంధనలను ఉల్లంఘించి బంధించడం.. నేరంగా పరిగణించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జూ పార్క్ ఆసుపత్రిలో క్వారెంటైన్ బ్లాక్‌లో ఉన్న పునుగు పిల్లికి ప్రత్యేక ఎన్‌క్లోజర్ ఏర్పాటుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పునుగు పిల్లితో పాటు నిశాచర జీవుల ఆవాసం కోసం 2018లో తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ ప్రాజెక్టుకు టిటిడి నిధులు కేటాయించింది.

పునుగుపిల్లితో పాటు 9 రకాల జాతులకు ప్రాథమిక వసతులతో ఆవాసం కల్పించేందుకు టిటిడి రూ. 2.50 కోట్లను కేటాయించింది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతితో దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఎన్‌క్లోజర్ నిర్మాణ పనులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. తొలి విడతలో రూ 2.50 కోట్లు, రెండో విడతలో రూ 4.30 కోట్లు కేటాయించిన టిటిడి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఏడాదిలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలా పనులు చేపట్టింది. మైథాలజీ కాన్సెప్ట్‌తో ఉన్న తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో నిర్మాణంలో ఉన్న ఎన్ క్లోజర్ పూర్తిగా ఎయిర్ కండిషన్, జనరేటర్ సౌకర్యంతో అందుబాటులోకి రాబోతోంది. తిరుపతి జూలో ప్రస్తుతం నాలుగు పునుగు పిల్లులు ఉండగా వాటి సంరక్షణతో పాటు పునరుత్పత్తి కోసం కూడా అటవీ శాఖతో కలిసి ప్రయత్నిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..