ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారికి అడ్డంగా నీరు ప్రవాహించడంతో రాకపోకలకు అడ్డంకిగా మారింది. బనగానపల్లె నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. మిడుతూరులో రోడ్డుకి వాగు అడ్డంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రవాహంలో కారు కొట్టుకొని పోతుండగా ట్రాక్టర్లతో అడ్డుపెట్టి స్థానికులు రక్షించారు. కారులో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. బనగానపల్లె నియోజకవర్గం లోకూడా భారీ వర్షం కురిసింది.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లో బుధవారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లె తో పాటు కోవెలకుంట్ల సంజామల అవుకు కొలిమిగుండ్ల మండళాల్లో వర్షం కురిసింది
కోవెలకుంట్ల, సంజామల మండలాల్లో అధిక వర్షపాతం నమోదయింది.
సంజామల వద్ద ఉప్పొంగిన పాలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. పాలేరు వాగు వంతెన పై వర్షపు నీరు ప్రవహిస్తోంది. నాలుగు అడుగుల మేర వంతెన పై వరద నీరు ప్రవహిస్తుండడంతో తిమ్మనైనపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెన పైనుండి వాగులోకి ఒకవైపు ఒరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సును వెంటనే ఆపి వేశాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందికి చేర్చాడు.
క్షేమంగా బస్సు నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు వాగు వంతెన పై నీరు భావిస్తుండడంతో సంజామల తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కావాలా ఉన్నారు. వాగు ఎవరూ దాటకుండ రక్షణ ఏర్పాటు చేశారు. సంజామల గ్రామానికి చెందిన బస్సులోని ప్రయాణికులను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..