Cyclone Michaung: మిచౌంగ్ జలప్రళయం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

మిన్ను విరిగి మీద పడ్డట్టుగా  మిచౌంగ్‌ తుఫాన్‌ పచ్చని పంటలపై విరుచుకపడింది. ఎటు చూసిన జల విధ్వంసమే. కాలనీలు చెరువులను తలపించాయి.  వాగులు వంకలు పొంగి  ఇళ్లలోకి వరద చొచ్చుకు వచ్చింది. ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంల్లో విలవిల్లాడాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగి అపార నష్టం వాటిల్లింది.

Cyclone Michaung: మిచౌంగ్ జలప్రళయం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
Cyclone Michaung
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Dec 07, 2023 | 12:32 PM

మిన్ను విరిగి మీద పడ్డట్టుగా  మిచౌంగ్‌ తుఫాన్‌ పచ్చని పంటలపై విరుచుకపడింది. ఎటు చూసిన జల విధ్వంసమే. కాలనీలు చెరువులను తలపించాయి.  వాగులు వంకలు పొంగి  ఇళ్లలోకి వరద చొచ్చుకు వచ్చింది. ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంల్లో విలవిల్లాడాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు కూలి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగి అపార నష్టం వాటిల్లింది. తుఫాన్‌ తీరం దాటింది.. కానీ రైతన్న కళ్లలో ఇంకా ఆవేదన సుడులు తిరుగుతూనే ఉంది. మాయదారి వాన దంచి కొడుతోంది. మరో రెండు రోజుల పాటు జలవిలయమే
బాపట్ల దగ్గర తుఫాన్‌ తీరం దాటింది. కానీ మిచౌంగ్‌ విధ్వంసం ఇంకా కొనసాగుతోనే ఉంది. ఎడదెరిపిలేని వానలతో వరద పోటెత్తుతోంది. చేతికొచ్చిన పంట నీట తుడిచిపెట్టుకుపోయి రైతులు కన్నటీ పర్యంతమవుతున్నారు. ఎటుచూడు జలవిలయమే.. పంటలన్నీ వరదపాలయ్యాయి. మిచౌంగ్‌ ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుఫాన్‌ తీరాన్ని తాకిన సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. సముద్రంలో 2మీటర్ల మేర అలలు ఎగిసిపడ్డాయి. గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
తీరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని పూరిళ్లు కూలిపోయాయి. తీరం సమీపంలో.. రోడ్లపై ఉన్న చిన్న తాత్కాలిక దుకాణాలు ఈదురుగాలులకు కొట్టుకుపోయాయి. ఏపీ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా.. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాళ్లోతు వరద నీరు వచ్చి చేరింది. ఇక వరద ధాటికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.  ఊహించనివిధంగా విరుచుకుపడిన జల విలయానికి జనజీవనం కకావికలమైంది. జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేశారు అధికారులు. ఎన్టీఆర్‌ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
బాపట్ల, తిరుపతి, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. దాదాపు 11 జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో 11 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే 24 గంటల్లో తుఫాన్ ప్రభావం ఉంటుందని.. అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరో రెండు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో కూడా తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మత్స్యాకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తుఫాన్‌ ధాటికి పంటలు చిన్నాభిన్నమై రైతులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్