AP Rains: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు

|

Dec 21, 2024 | 4:53 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బలపడి వాయుగుండంగా ఏర్పడి.. ఇది మరికొద్దిగంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి.. ఆ తర్వాత బలహీనపడుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటే

AP Rains: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
Representative Image
Follow us on

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తూర్పు ఈశాన్యంగా కదిలి.. ఈరోజు అనగా డిసెంబర్ 21న ఉదయం 8.30 గంటలకు, 14.0 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 84.5 డిగ్రీల తూర్పు రేఖాంశం చెన్నైకి (తమిళనాడు) తూర్పు-ఈశాన్య 480 కి.మీ.. దూరంలో, విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్) దక్షిణ-ఆగ్నేయంగా 430 కి.మీ. దూరంలో, గోపాల్‌పూర్(ఒడిశా)కి దక్షిణ దిశలో 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఈ వాయుగుండం నెమ్మదిగా తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ, దాని తీవ్రతను తదుపరి 12 గంటల పాటు కొనసాగించి, ఆ తర్వాత సముద్రంలో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
—————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
—————————————-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-
——————————

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు కురిసే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే ఆవకాశముంది.

రాయలసీమ:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఇది చదవండి: స్టైల్‌గా స్మార్ట్ వాచ్‌లను వాడుతున్నారా.? ఇది చూస్తే మీ గుండె ఆగినంత పనవుతుంది