Andhra: ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..

ద్రోణి ప్రభావంతో అటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరి వచ్చే 2 రోజుల్లో ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీ తెలుసుకుందామా. ఒకసారి లుక్కేయండి మరి ఇక్కడ.

Andhra: ఆహా.! ఎంతటి చల్లటి కబురు చెప్పారండీ.. వచ్చే 3 రోజుల ఏపీలో వాతావరణం ఇలా..
Andhra Weather Report

Updated on: Aug 26, 2025 | 7:18 AM

ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య కొనసాగుతోంది, ఇది ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంది.దీని ప్రభావంతో, రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ద్రోణి ఇప్పుడు దక్షిణ హర్యానా దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య రాజస్థాన్ ప్రాంతములో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకులో నున్న ఉపరితల ఆవర్తనం వరకు దక్షిణ ఉత్తరప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గంగా తీర పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 & 3.1 కి.మీ.ల మధ్య కొనసాగుతుంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

ఈరోజు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఈరోజు:-

తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.