AP Weather Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రిపోర్ట్‌ను ప్రకటించింది. ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అలాగే రాగల మూడు రోజులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాతావరణ వివరాలను విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు విడుదల చేశారు. ఈ వివరాల ప్రకారం..
జూలై 10(శనివారం)..
ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
జూలై 11(ఆదివారం)..
కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
జూలై 12 (సోమవారం)..
రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
Xiaomi Mi Pad: షియోమి నుంచి మరో ఎంఐ ప్యాడ్.. చైనాలో మంత్రిత్వశాఖ నుంచి అనుమతులు..
Farmers Died: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. పొలంలో.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువ రైతులు మృతి..