AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: నైరుతి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకగా.. రానున్న రోజుల్లో మరింత విస్తరించనున్నాయి.

Weather Report: నైరుతి ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక..
Rains
Venkatrao Lella
|

Updated on: Jun 09, 2026 | 1:50 PM

Share

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. నైరుతి రాకతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడనున్నాయి.  నైరుతి రుతుపవనాలు జూన్ 9 నాటికి ఈశాన్య రాష్ట్రాలలోని మిగిలిన ప్రాంతాలు, సిక్కిం మొత్తం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగాయి.  రాబోయే 4-5 రోజులలో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తర అంతర్గత కర్నాటక దాని పరిసరాలలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 4.5 నుండి 5.8 కి మీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. తూర్పు ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వరకు విస్తరించి ఉన్న ద్రోణి  బలహీనపడింది.

తెలంగాణకు వర్షసూచన

వీటి ప్రభావంతో ఈరోజు,రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజులలో పెద్దగా మార్పు లేదని వాతావరణశాఖ తెలిపింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఏపీలో వర్షాలు

ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రాయలసీమ, ఉత్తరాకోస్తా, దక్షిణ కోస్తా వ్యాప్తంగా వానలు కురవనున్నాయి. అటు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులేకుండానే కొంచెం తగ్గే అవకాశముంది.

Follow Us