ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్(ఐఎండీ) అంచనాల ప్రకారం గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని 125 మండలాల్లో, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలకు వడగాల్పుల హెచ్చరిక మెసెజ్లు పంపిస్తున్నామని, ఆయా ప్రాంతాలవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇక రేపు అంటే గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.
గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో అల్లూరి జిల్లాలోని 7, అనకాపల్లిలో 15 మండలాలు ఉన్నాయి. అలాగే తూర్పుగోదావరిలో 4, ఏలూరులో 2, గుంటూరులో 11, కాకినాడలో 10, కృష్ణాలో 4, ఎన్టీఆర్‌లో 12, పల్నాడులో 5, పార్వతీపురం మన్యంలో 11, శ్రీకాకుళంలో 13, విశాఖపట్నంలో 2, విజయనగరంలో 23, వైఎస్ఆర్ జిల్లాలో 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాగా, బుధవారం అనకాపల్లి 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు వీస్తున్నట్లు నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..