Andhra: ఈ చిత్రం చూశారా…? సీసీ రోడ్డు నడి మధ్యలో చేతి పంపు..

గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్ల వ్యవహారం ఎంత అడ్డదిడ్డంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఘటనే ఉదాహారణ. చేతి పంపు ఉన్నా అలాగే సీసీ రోడు వేసిన నిర్వాకం పెనుకొండలో వెలుగుచూసింది. మరి ఇక్కడ తప్పు అధికారులదా..? లేక కాంట్రాక్టర్‌దా అనేది తేలాల్సి ఉంది.

Andhra: ఈ చిత్రం చూశారా...? సీసీ రోడ్డు నడి మధ్యలో చేతి పంపు..
Hand Pump

Edited By:

Updated on: Apr 26, 2025 | 9:12 PM

అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇది. స్థానికులు నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సవిత ఆ ప్రాంతంలో బోర్ వేయించి.. చేతి పంపు ఏర్పాటు చేయించారు. అయితే ఇటీవల ఆ పంపు సమీపం గుండా డబుల్ సీసీ రోడ్డు మంజూరైంది. దాన్ని ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. రోడ్డు వేయగా… చేతి పంపు అటు ఇటుగా ఆ సీసీ మార్గం మధ్యలోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆ కాంట్రాక్టర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడో లేదో తెలియదు కానీ… ఆ పంపు మధ్యలో ఉండగానే సీసీ రోడ్డు వేశాడు. దీంతో ఇప్పుడు నడిమధ్యకు ఆ చేతి పంపు ఉంది. దీంతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్ దగ్గర్లో ఇటీవల మంత్రి సవిత చేతిపంపును వేయించారు. అయితే అధికారుల నిర్లక్ష్యమో…. కాంట్రాక్టర్ నిర్వాకమో తెలియదు గానీ రోడ్డు మధ్యలో చేతిపంపు అలాగే వదిలేసి… సిమెంట్ రోడ్డు వేశారు. దీంతో ఇప్పుడు సిమెంట్ రోడ్డు మధ్యలో చేతిపంపు ఉండటంతో అటు వాహనాల రాకపోకలకు అసౌకర్యంగా ఉంటుంది.  అటు వాహనాలు తిరిగే రోడ్డులో నీళ్లు పట్టుకోవడం కూడా కుదరదు.

సిమెంట్ రోడ్ మంజూరైన తర్వాత.. కనీసం అధికారులు ఆ పంపు నీటిని వినియోగించుకునేలా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తే బాగుండేంది. ప్రస్తుతం ఆ పంపు ఇప్పుడు నిరుపయోగంగా మారింది. ఇటు కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు కూడా వాహనదారులకు సక్రమంగా అందుబాటులో లేని ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఉన్న చేతిపంపును తొలగిస్తారా??? లేక మరో మార్గంలో ఆ నీటిని వినియోగించుకునే ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి.

వీడియో దిగువన చూడండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..