AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GVMC: వ్యూహం ఫలించింది.. జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్‌ హరివెంకటకుమారిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..

పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి.. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడ గట్టుకుని.. మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి.. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. త్వరలోనే కొత్త మేయర్‌ను ఎన్నుకుని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. 

GVMC: వ్యూహం ఫలించింది.. జీవీఎంసీపై కూటమి జెండా.. మేయర్‌ హరివెంకటకుమారిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం..
Gvmc No Confidence Vote
Shaik Madar Saheb
|

Updated on: Apr 19, 2025 | 12:05 PM

Share

పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కూటమి.. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) లో కూటమి జెండాను ఎగరేసింది.. పక్కా వ్యూహంతో అధికార కూటమి మేయర్‌ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో కలిపి 74 మంది మద్దతును కూడ గట్టుకుని.. మేయర్ హరి వెంకటకుమారిపై అవిశ్వాసాన్ని నెగ్గింది కూటమి.. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74మంది ఓటేశారు. కోరం సరిపోవడంతో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మేయర్‌ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. 74 మంది మద్దతు తెలిపారుర. ఆదివారం కూటమి కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోనున్నారు. కాగా.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది.. కార్పొరేటర్లు సమావేశానికి హాజరు కావొద్దంటూ విప్‌ జారీ చేసినప్పటికీ.. వైసీపీ వ్యూహం ఫలించలేదు..

కాగా.. విశాఖలో ధర్మం, న్యాయం గెలిచాయన్నారు ఎంపీ సీఎం రమేష్. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి మరీ ఆయన ఓటేశారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. త్వరలోనే కొత్త మేయర్‌ను ఎన్నుకుని విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

కూటమి సంబరాలు..

శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగా.. హెడ్‌ కౌంట్ అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకున్నారు.. అనంతరం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఓటింగ్‌లో 74 మంది సభ్యుల బలంతో కూటమి విజయం సాధించింది. వైసీపీ మేయర్ వెంకట కుమారిపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గడంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సంబరాలు చేసుకుంటున్నాయి.

డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
డ్రైన్‌లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్‌ పోలీసులు ఏం చేశారో తెలుసా
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
ఆ ఇద్దరు బ్యూటీస్ టైమ్ మొదలైంది.. హిట్ కొడితే దిమ్మ తిరగాల్సిందే
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
టాలీవుడ్ ను ఏలుతున్న తెలుగు బ్యూటీస్..
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
ఇలా ప్లాన్ చేసుకుంటే అందరికీ కష్టమే కదా బాసూ..?
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో తెలుగు లోకి అడుగుపెడుతున్న రెహ్మాన్
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
Allu Arjun: అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసింది వాళ్లేనా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
గ్రాఫిక్స్ ఎంతవరకు వచ్చింది.. అసలు విశ్వంభర రిలీజ్ అవుతుందా. లేదా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్‌.. అతడిలా కోటికి ఒక్కరుంటారు