AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా..

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన దాది కోటేశ్వరమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. సాయంత్రం ఇంటికొచ్చిన కొడుకు రక్తపు మడుగులో పడిఉన్న తల్లిని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి.. లోపలికెళ్లి చూడగా..
Pedakakani Murder
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 08, 2026 | 1:29 PM

Share

కొడుకు పని నుండి ఇంటికొచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో కనిపించింది. ఈ సీన్ చూసి ఒక్కసారి కొడుకు ఖంగుతిన్నాడు. వెంటనే స్తానికలు సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఉండాల్సిన 2.5 లక్షల నగదు, ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు కనిపించడం లేదన్న అంశాన్ని కొడుకు పోలీసుల ద్రుష్టికి తీసుకెళ్లాడు. దీంతో బంగారు ఆభరణాలు, డబ్బు కోసమే హత్య జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన దాది కోటేశ్వరమ్మ పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. పశుపోషణ చేసుకుంటూ జీవిస్తుంది. కోటేశ్వరమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో ఆమె అత్తగారింటికి వెళ్లింది. ఇక మిగిలిని కొడుకు సాదిక్ తో కలిసి నివస్తుంది. ఆమెకు స్వంత ఇల్లు లేకపోవడంతో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే డ్వాక్రా రుణం తీసుకొని స్వంత ఇంటి నిర్మాణం చేసుకోవాలని అమ్మాకొడుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక డ్వాక్రా రుణం రెండున్నర లక్షల రూపాయల తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు.

ఇక త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. కానీ ఇంతలోనే ఊహించన సంఘటన జరిగింది. ఏదో పని నిమిత్తం ఆదివారం ఉదయం కొడుకు సాదిక్ బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఇంట్లో తల్లి కోటేశ్వరమ్మ రక్తపు మడుగులో కనిపించింది. అది చూసిన సాదిక్ గుండె పగిలింది.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. కాసేపటికి తేరుకొని స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం ఫోరెన్సిక్ టీమ్ సహాయంతో ఘటనా స్థలానికి పూర్తిగా పరిశీలించారు. అయితే సాదిక్ ఏదో డౌట్ వచ్చి ఇంట్లో ఉండాల్సిన నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయా లేదా అని చూశాడు.. కానీ అక్కడ అవేవి కనిపించలేదు. దీంతో దొంగతనానికి వచ్చిన వారే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి
ఇంటికొచ్చిన కుమారుడికి రక్తపు మడుగులో కనిపించిన తల్లి
తీపి తినాలనిపిస్తే నువ్వుల లడ్డు తినండి.. కానీ వీరు ముట్టుకోకూడదు
తీపి తినాలనిపిస్తే నువ్వుల లడ్డు తినండి.. కానీ వీరు ముట్టుకోకూడదు
అభిషేక్ ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే..
అభిషేక్ ఊచకోతే.. కేవలం 15 బంతుల్లోనే..
హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్.
హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్.
రాత్రి ఆకలి వేస్తే టెన్షన్ వద్దు.. కడుపు నింపే 6 హెల్తీ స్నాక్స్
రాత్రి ఆకలి వేస్తే టెన్షన్ వద్దు.. కడుపు నింపే 6 హెల్తీ స్నాక్స్
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఎంత మంచిదంటే?
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఎంత మంచిదంటే?
తరచూ నీరసంగా ఉంటున్నారా? శరీరంలో ఈ లోపం ఉండొచ్చు!
తరచూ నీరసంగా ఉంటున్నారా? శరీరంలో ఈ లోపం ఉండొచ్చు!
‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు
‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు
పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
చెడు కొలెస్ట్రాల్ సైలెంట్‌గా పెరుగుతుంది.. ఈ లక్షణాలుంటే అలర్ట్!
చెడు కొలెస్ట్రాల్ సైలెంట్‌గా పెరుగుతుంది.. ఈ లక్షణాలుంటే అలర్ట్!