ఫ్రెండ్స్‌తో రూ.50 పందెం .. అమాంతం పెన్ మింగిన విద్యార్ధి! కట్ చేస్తే మూడేళ్ల తర్వాత షాకింగ్ సీన్

తొమ్మిది తరగతి చదువుతుండగా స్నేహితులతో యాభై రూపాయలు పందెం కాసి ఓడిపోయాడు. దీంతో పందెం ప్రకారం పెన్ను అమాంతం మింగేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారరి దాచి పెట్టాడు. అయితే మూడేళ్ల తర్వాత అంటే ఇంటర్ లో చేరిన కొన్ని రోజులకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. ఆస్పత్రిలో చెక్ చేయించగా అసలు సంగతి..

ఫ్రెండ్స్‌తో రూ.50 పందెం .. అమాంతం పెన్ మింగిన విద్యార్ధి! కట్ చేస్తే మూడేళ్ల తర్వాత షాకింగ్ సీన్
Guntur GGH Doctors Remove Pen From Student Stomach

Edited By:

Updated on: Jan 01, 2026 | 10:58 AM

గుంటూరు, జనవరి 1: మూడేళ్ల క్రితం స్నేహితులతో పందెం వేశాడు. తెలిసి తెలియని తనంలో ఏకంగా పెన్ మింగేశాడు. అలా మింగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టాడు. పది రోజుల క్రితం తీవ్రమైన కడునొప్పి రావడంతో అసలు విషయం చెప్పేశాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా… జిజిహెచ్ లో ఎటువంటి సర్జరీ లేకుండానే పెన్నును తొలగించారు.

గుంటూరు కొత్తపేటకు చెందిన శ్రీనివాసరావు దంపతుల కొడుకు మురళి క్రిష్ణ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం భరించలేనంతగా కడుపునొప్పి వచ్చింది. కొడుకు నొప్పికి తట్టుకోలేకపోవడంతో తల్లిదండ్రుకలు ఏం జరిగిందో అర్ధం కాలేదు. వెంటనే కొడుకు తీసుకొని ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ మురళి క్రిష్ణ అసలు విషయం చెప్పాడు. తొమ్మిది తరగతి చదువుతుండగా స్నేహితులతో యాభై రూపాయలు పందెం కాశాడు. పెందెంలో భాగంగా పెన్ను అమాంతం మింగేశాడు. ఈ విషయం ఇంట్లో చెబితే తిడతారన్న భావనతో చెప్పకుండా దాచి పెట్టాడు. అయితే ఎప్పుడైతే విపరీతమైన కడుపునొప్పి వచ్చిందో అప్పుడు గతంలో పెన్ను మింగిన విషయాన్ని చెప్పాడు. వైద్యులు వెంటనే సిటీ స్కాన్ పరీక్ష చేయగా పేగుల్లో ఉన్న పెన్ను కనిపించింది. పెన్ను తొలగించేందుక టీమ్ డాక్టర్స్ భేటి అయ్యారు. సర్జరీ లేకుండా పెన్ను తొలగించే విధానం చర్చించారు.

డాక్టర్ కవిత, నాగూర్ బాషా, శివరామక్రిష్ణ బ్రుందం రెట్రో గ్రేడ్ ఎంటెరోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ విధానంలో పెన్నును తొలగించవచ్చని నిర్ధారించారు. ఈ విధానం శరీరంపై ఎటువంటి గాటు లేకుండా పెన్నును తొలగించవచ్చన్నారు. వెంటనే డాక్టర్ల బ్రుందం రంగంలోకి దిగి మురళి క్రిష్ణ మూడేళ్ల క్రితం మింగేసిన పెన్నుతో తొలగించారు.. ఉచితంగానే పెన్నును తొలగించి రోగికి ఉపశమనం కల్గించిన వైద్యుల బ్రుందాన్ని అటు జిజిహెచ్ సూపరింటిండెంట్ రమణ యశస్వి, ఇటు తల్లిదండ్రులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.