ఏపీలో నిన్నటి వరకు రైతుల గోడు పట్టించుకోని అధికారులు హడావిడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు కోనసీమ జిల్లా పి.గన్నవరం జనసేన కార్యకర్తలు. ఇదే విషయంపై వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం రాజులపాలెంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు రానున్నారు పవన్ కళ్యాణ్. నిన్నటి వరకు రైతుల గోడు వినిపించుకోని అధికారులు జనసేన నేత పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న వార్త తెలిసి హడావిడిగా రైతుల కల్లాల్లోకి వచ్చి బలవంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ కార్యకర్తలు.
జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు అధికారులు. కనీసం తేమశాతం కూడా చెప్పకుండా రైతుల కల్లాల నుంచి ధాన్యం తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు జనసేన కార్యకర్తలు.
నిన్నటి వరకు ధాన్యం కొనండి మహాప్రభో అంటూ నెత్తీనోరూ బాదుకున్నా పట్టించుకోలేదు అధికారులు. పైగా సంచులు లేవని…తేమ ఎక్కువగా ఉందని సాకులు చెప్పారు. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారని నిలదీశారు జనసేన కార్యకర్తలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..